E-Paper
Advertisement

Midnight Snapper: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?

Midnight Snapper: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?

Midnight Snapper: మీకు ఎప్పుడైనా అనిపించిందా.. ‘చేపలది ఎంత ప్రశాంతమైన లైఫ్, ఏ గొడవలు ఉండవు. నీళ్లలో ఈదుకుంటూ అలా సైలెంట్‌గా ఉంటాయి’ అని. ఇలా అనుకుంటే మాత్రం.. మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. మనలాగే చేపలు కూడా గుంపులుగా చేరి ముచ్చట్లు పెడతాయట. అవును.. మీరు విన్నది నిజమే! సముద్రంలో నివసించే చేపలు నిశ్శబ్దంగా ఉంటాయి అనుకుంటే పొరపాటే.

మనలాగే సముద్ర గర్భంలో నివసించే చేపల మధ్య  గొడవలు, తీర్మానాలు, చివరకు పాటలు పాడే టాలెంట్ కూడా ఉంటాయని చెబుతున్నారు సైంటిస్టులు. కొన్ని చేపలైతే ఏకంగా పులిలా గర్జిస్తే.. మరికొన్ని డ్రమ్స్ వాయిస్తున్నట్లు సౌండ్ చేస్తాయట. రండి.. ఈ చేపల భాష వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

పాటలు పాడే మిడ్‌నైట్ స్నాప్పర్..

అ చేపలది మనుషుల భాష కాకపోయినా.. అవి చేసే శబ్దాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. కొన్ని చేపలు గంభీరంగా గర్జిస్తే.. మరికొన్ని పాటలు పాడతాయట. ‘గ్రంటర్ ఫిష్’ జాతి చేపల గొంతు నుండి పులి గర్జన వినిపిస్తాయట. అలాగే ‘క్రోకర్ ఫిష్’ చేసే శబ్దాలు వింటే ఎవరో డ్రమ్స్ వాయిస్తున్నట్లుగా అనిపిస్తుందట. వీటన్నింటినీ మించిన ‘మిడ్ నైట్ స్నాప్పర్’ అనే జాతి చేపలు రాత్రి సమయాల్లో పాటలు పాడుతూ సముద్రపు లోతుల్లో ఒక వింతైన వాతావరణాన్ని సృష్టిస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Also Read: ఏడాదిలో 5 రోజులు ఆ గ్రామ స్త్రీలు నగ్నంగానే ఉండాలి.. నిబంధన అతిక్రమిస్తే ఏం జరుగుతుందంటే?

ఈ చేపలు ఎక్కడుంటాయి?

మిడ్‌నైట్ స్నాప్పర్ చేపలు ప్రధానంగా ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఇండో-పసిఫిక్ సముద్రాలు, కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని లోతైన ప్రాంతాల్లోనూ ఇవి ఎక్కువగా నివసిస్తాయి. ఈ చేపలు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి, సముద్రం అడుగున ఉండే కొండచరియలు, పాచి పట్టిన రాళ్ల మధ్య తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఇలాంటి ప్రదేశాల్లోనే అవి తమ తోటి చేపలతో కమ్యూనికేట్ చేస్తుంటాయట.

శబ్దాలను ఎలా సృష్టిస్తాయి?

మనుషులకు గొంతులో స్వరతంత్రులు ఉన్నట్లే.. చేపలకు కూడా శబ్దాలు చేసేందుకు ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఇవి తమ శరీరంలోని గాలితిత్తిని ఉపయోగించి లేదా పళ్లు, ఎముకలను ఒకదానికొకటి రాపిడి చేయడం ద్వారా విభిన్న ధ్వనులను సృష్టిస్తాయి. అయితే ఈ శబ్దాలను తమ జాతి చేపలను ప్రమాదాలను నుంచి కాపాడటానికి, ఆహారం దొరికినప్పుడు సమాచారం ఇవ్వడానికి,  సంతానోత్పత్తి సమయంలో భాగస్వామిని ఆకర్షించడానికి చేస్తాయట.

కొనసాగుతున్న పరిశోధనలు..

ప్రస్తుతం సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ చేపల శబ్దాలను హైడ్రోఫోన్‌ల ద్వారా రికార్డ్ చేస్తున్నారు. ఆ శబ్దాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, వాటి అర్థాలను విశ్లేషించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో మనం ఈ చేపల భాషను పూర్తిగా అర్థం చేసుకోగలిగితే.. సముద్రపు పర్యావరణ వ్యవస్థలో జరుగుతున్న మార్పులను, జలచరాల జీవనశైలి గురించి మరింత లోతుగా తెలుసుకోవచ్చు.

Also Read: పక్షులేమీ పిచ్చివి కావు.. ఆకాశంలో V షేప్‌లో ఎందుకు వెళ్తాయో తెలిస్తే.. వాటి తెలివికి ఫిదా అయిపోతారు!

 

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×