E-Paper
Advertisement

Mediterranean Sea: గంటకు 115 కి.మీ వేగంతో దూసుకొచ్చిన వరద.. మధ్యధరా సముద్రాన్ని పుట్టించిన భయంకర ప్రళయం ఇదే!

Mediterranean Sea: గంటకు 115 కి.మీ వేగంతో దూసుకొచ్చిన వరద.. మధ్యధరా సముద్రాన్ని పుట్టించిన భయంకర ప్రళయం ఇదే!
Advertisement

Mediterranean Sea: మనకు తెలిసినంత వరకు ఈ భూమ్మీద వచ్చిన అతిపెద్ద వరద అంటే.. భారీ వర్షాలు పడి ఊర్లు మునిగిపోవడం, సునామీ వచ్చి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేయడం వంటివే అనుకుంటున్నాం. కానీ అంతకు మించిన, అమెజాన్ కంటే వెయ్యిరెట్ల వేగంతో దూసుకొచ్చిన వరద గురించి మనలో చాలామందికి తెలియదు. సుమారు 53 లక్షల ఏళ్ల క్రితం ఈ భూమ్మీద ఒక మహా జలప్రళయం సంభవించింది. అది ఎంత భయంకరమంటే.. ఇప్పుడు మనం మ్యాప్‌లో చూస్తున్న మధ్యధరా సముద్రాన్ని కేవలం రెండేళ్లలోనే సృష్టించింది. వినడానికి ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీలా అనిపించినా.. ఈ Mega Flood రహస్యాలు తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది.

అసలు కథ ఇక్కడే మొదలైంది..

మనం ఇప్పుడు చూస్తున్న మధ్యధరా సముద్రం అసలు సముద్రమే కాదు. అదొక లోతైన లోయ లాంటి ఖాళీ భూభాగం. మెస్సీనియన్ కాలంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఈ ప్రాంతం విడిపోయింది. దాంతో అక్కడ ఉన్న నీరంతా ఆవిరైపోయి, సముద్రం అడుగుభాగం ఒక కిలోమీటరు లోతుకు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎండలు ఎలా ఉండేవో తెలుసా? అక్కడి జీవజాలంలో కేవలం 11 శాతం మాత్రమే ఆ వేడిని తట్టుకుని ప్రాణాలతో ఉండగలిగాయి. శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు కిలోమీటరు మందంతో పేరుకుపోయిన ఉప్పు పొరను చూసి విస్తుపోయారట.

Advertisement

Also Read: కొండంచున కాఫీ షాపు.. అక్కడ హెల్మెట్ తప్పనిసరి, లేకపోతే..

ఆ 24 నెలల బీభత్సం..

సుమారు 5.3 మిలియన్ల సంవత్సరాల క్రితం.. అట్లాంటిక్ మహాసముద్రం అడ్డుగా ఉన్న భూభాగాన్ని చీల్చుకుంటూ మధ్యధరా లోయలోకి దూసుకొచ్చింది. దీనినే శాస్త్రవేత్తలు Zanclean Megaflood అని పిలుస్తారు. గియోవన్నీ బర్రేకా అనే శాస్త్రవేత్త బృందం ఇటీవల సిసిలీ తీరంలో జరిపిన పరిశోధనల ప్రకారం.. 53 లక్షణ ఏళ్ల క్రితం ఏర్పడిన వరద నీరు 40 మీటర్ల లోతుతో, గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిందట.

అమెజాన్ కంటే వెయ్యి రెట్ల వేగంతో..

Advertisement

ఒక్కసారి ఊహించుకోండి.. అమెజాన్ నదిలో పారే నీటికి వెయ్యి రెట్ల వేగంతో నీరు దూసుకొస్తే ఎలా ఉంటుందో? ఆ వేగానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు కూడా పేకమేడల్లా కొట్టుకుపోయాయి. కేవలం కొన్ని నెలల్లోనే ఆ లోయ నిండిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు మ్యాప్‌లో కనిపిస్తున్న మధ్యధరా సముద్రం ఏర్పడింది.

ఇప్పటికీ కనిపిస్తున్న ఆనవాళ్లు..

ఈ బీభత్సం వెనుక ఉన్న సాక్ష్యాలు నేటికీ సముద్రం అడుగున నిక్షిప్తమై ఉన్నాయి. సిసిలీ సమీపంలోని కొండల నిర్మాణం, అమెరికాలోని వాషింగ్టన్ Mega Flood ఆనవాళ్లను పోలి ఉన్నాయి. అట్లాంటిక్ నుంచి నీరు పడే సమయంలో అక్కడ కిలోమీటర్ల ఎత్తులో అతిపెద్ద జలపాతం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అందుకే అంటారు.. ప్రకృతి తలచుకుంటే చిటికెలో ఎంతటి మార్పునైనా తీసుకురాగలదని. మధ్యధరా సముద్రం పుట్టుక వెనుక ఇంతటి భయంకరమైన చరిత్ర ఉందని తెలుసుకున్న వాళ్లంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు మరి.

Also Read: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×