E-Paper
Advertisement

Blocked arteries: బ్లాక్ అయిన రక్తనాళాలను క్లియర్ చేసే 3 సహజ అలవాట్లు ఇవే.

Blocked arteries: బ్లాక్ అయిన రక్తనాళాలను క్లియర్ చేసే 3 సహజ అలవాట్లు ఇవే.
Advertisement

Blocked arteries: గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం అనేది నేటి కాలంలో ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. బిజీ లైఫ్, జంక్ ఫుడ్ , శారీరక శ్రమ లేకపోవడం వల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుంది. అయితే.. ప్రముఖ వాస్కులర్ సర్జన్ల ప్రకారం.. కేవలం మందుల ద్వారానే కాకుండా మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూడు ముఖ్యమైన అలవాట్ల గురించి  వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ (సరైన ఆహారపు అలవాట్లు): మన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం.

Advertisement

పండ్లు, కూరగాయలు: వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల గోడలను దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, బెర్రీలు గుండెకు మేలు చేస్తాయి.

మంచి కొవ్వులు: ఆలివ్ ఆయిల్, అవకాడో, బాదం, వాల్‌నట్స్ వంటి వాటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతాయి.

Advertisement

చక్కెర, మైదాలకు దూరం: ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెర రక్తనాళాల్లో వాపు కలిగిస్తాయి. వీటిని తగ్గించడం వల్ల ధమనులు క్లియర్ అవుతాయి.

2. క్రమబద్ధమైన శారీరక శ్రమ:
వ్యాయామం అనేది రక్తనాళాలకు ఒక సహజమైన క్లీనర్ లాంటిది.

వాకింగ్: రోజుకు కనీసం 30-40 నిమిషాల వేగవంతమైన నడక రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ‘నైట్రిక్ ఆక్సైడ్’ విడుదలకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది రక్తనాళాలను వెడల్పుగా చేసి రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.

గుండె వేగం పెరిగే వ్యాయామాలు: సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటి పనుల వల్ల గుండె కండరాలు దృఢంగా మారుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ‘మంచి కొలెస్ట్రాల్’ పెరుగుతుంది.

3. ఒత్తిడి నిర్వహణ,తగినంత నిద్ర:

చాలామంది గుండె ఆరోగ్యం అంటే కేవలం ఆహారం, వ్యాయామం అనుకుంటారు. కానీ మానసిక ప్రశాంతత అంతే ముఖ్యం.

స్ట్రెస్ కంట్రోల్: దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది రక్తపోటును పెంచి రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన హాబీలలో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

గాఢ నిద్ర: రాత్రిపూట 7-8 గంటల నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. నిద్రలో మన శరీరం రక్తనాళాలను రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి నాణ్యమైన నిద్ర గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ముఖ్య గమనిక: పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారు వాటిని మానుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఇవి నేరుగా రక్తనాళాలను విషతుల్యం చేస్తాయి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×