E-Paper
Advertisement

Gold Silver Prices: మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్.. ఎంతేంత పెరిగాయంటే?

Gold Silver Prices: మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్.. ఎంతేంత పెరిగాయంటే?
Advertisement

Gold Silver Prices: అమెరికా, భారత్ ట్రేడ్ డీల్, సుంకాలు తగ్గింపుతో మార్కెట్లు పుంజుకున్నాయి. అలాగే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెవిన్ వార్ష్ ను సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా నామినేట్ చేశారు. యూఎస్‌ ఫెడ్‌కు కొత్త ఛైర్మన్‌ నియామకం, సీఎంఈ మార్జిన్‌ను పెంచడం, భారీ ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణాలతో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లు చేస్తుండడంతో మళ్లీ బంగారం, వెండి ధరలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లో గోల్డ్ ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుంది. సిల్వర్ 85.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్ లోనూ గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.

గోల్డ్ రూ.6 వేలు, వెండి రూ.20 వేలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.1.56 లక్షల వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2.74 లక్షలకు చేరింది. సోమవారం ధరలతో పోలిస్తే బంగారం దాదాపు రూ.6 వేలు పెరగ్గా, వెండి రూ.20 వేలకు పైగా పెరిగింది. ఎంసీఎక్స్‌ ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.51 లక్షల వద్ద ట్రేడవుతుంది. కిలో వెండి రూ.2.60 లక్షలుగా ఉంది.

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. అలాగే భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని సంకేతాలు వస్తున్నాయి. దీంతో భారత్, అమెరికా ట్రేడ్ డీల్ కు మార్గం సుగుమం అయింది. భారతీయ వస్తువులపై యూఎస్ సుంకాలను 18%కి తగ్గించింది.

Also Read: మిడిల్ క్లాస్ ఊపిరి పీల్చుకో.. భారీగా తగ్గిన బంగారం, సిల్వర్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్ లో

Advertisement

ఇటీవలి వెండి బంగారం కంటే ఎక్కువ ధర పలికింది. స్పాట్ ధరలు 5.9% పెరిగి ఔన్సుకు 84.09 డాలర్లకు చేరుకుంది. గత గురువారం సిల్వర్ రికార్డు స్థాయిలో 121.64 డాలర్లకు చేరుకుంది. స్పాట్ ప్లాటినం ఔన్సుకు 3% పెరిగి USD 2,183.64 కు చేరుకుంది. భారత్ లో గ్రాము వెండి ధర రూ.299గా ఉంది. నిన్న రూ.100 వరకు తగ్గింది. తాజాగా MCX వెండి ధర 11.95% పెరిగి రూ.30164.32 కు చేరుకుంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×