E-Paper
Advertisement

Breast Cancer: క్యాన్సర్ కణాలకు మరణశాసనం.. కొత్త యాంటీబాడీతో ప్రాణాంతక వ్యాధికి అడ్డుకట్ట!

Breast Cancer: క్యాన్సర్ కణాలకు మరణశాసనం.. కొత్త యాంటీబాడీతో ప్రాణాంతక వ్యాధికి అడ్డుకట్ట!
Advertisement

Breast Cancer: క్యాన్సర్.. ఈ పదం వినగానే గుండెల్లో ఎక్కడో ఓ భయం మొదలవుతుంది కదూ. ఈ మహమ్మారిని పూర్తిగా నిరోధించడానికి వైద్యశాస్త్రం ఎంత పురోగమించినా, కొన్ని రకాల క్యాన్సర్లు మాత్రం వైద్యులకు, రోగులకు పెను సవాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా ‘ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్’ (TNBC) గురించి తెలిస్తే ఈ భయం మరింత పెరుగుతుంది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తూ, చికిత్సకు అంత సులభంగా లొంగదు. అయితే, ఈ మొండి క్యాన్సర్‌కు చెక్ పెట్టే దిశగా శాస్త్రవేత్తలు ఒక ఆశాజనకమైన ముందడుగు వేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

సవాలు విసురుతున్న మొండి క్యాన్సర్:

సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయడం సులభం. కానీ ఈ టీఎన్‌బీసీ కథ వేరు. ఇది ప్రాథమిక దశలోనే శరీరంలోని ఇతర భాగాలకు పాకేస్తుంది. పైగా దీనిపై సాధారణ మందులు పెద్దగా ప్రభావం చూపవు. ఒకవేళ చికిత్స తీసుకున్నా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలా మళ్లీ వ్యాధి బయటపడినప్పుడు రోగిలో రోగనిరోధక శక్తి బాగా క్షీణించి, శరీరం మరింత బలహీనపడిపోతుంది.

Advertisement

Also Read: పురుషుల్లోనే ఎక్కువగా జుట్టు రాలడానికి గల 4 ప్రధాన కారణాలు ఇవే!

యాంటీబాడీ చికిత్స:

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకులు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. కణితి పెరగడానికి కారణమయ్యే ప్రత్యేక ప్రొటీన్‌ను గుర్తించి, దాన్ని అడ్డుకునేలా శక్తివంతమైన యాంటీబాడీని అభివృద్ధి చేశారు. ఇది ఆ ప్రొటీన్‌ను అణచడమే కాదు.. దెబ్బతిన్న రోగనిరోధక వ్యవస్థను తిరిగి ఉత్తేజపరుస్తుంది. దీంతో మన శరీరం తనంతట తానుగా క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తుంది.

భవిష్యత్తుపై కొత్త ఆశలు:

Advertisement

ఈ కొత్త చికిత్స కేవలం రొమ్ము క్యాన్సర్ కణాలనే కాకుండా.. కీమోథెరపీకి కూడా లొంగని కణాలను సమర్థవంతంగా నాశనం చేసింది. ఊపిరితిత్తులకు వ్యాపించే క్యాన్సర్ కణాలను సైతం అడ్డుకోవడం విశేషం. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర ప్రాణాంతక క్యాన్సర్ల నివారణలోనూ ఇది ఒక కీలక మలుపు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, మందులతో పాటు వ్యాధిని జయించగలననే ఆత్మవిశ్వాసం రోగికి కొండంత అండగా నిలుస్తుందని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

Also Read: బరువు తగ్గాలా? గుండె హెల్దీగా ఉండాలా? అయితే రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి చాలు!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×