Hair loss in men: వయసుతో సంబంధం లేకుండా.. అధిక శాతం మంది పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. స్త్రీలతో పోల్చుకుంటే ఎక్కువగా మగవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ బట్టతల సమస్య ముఖ్యంగా యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే.. జుట్టు రాలడానికి గల కారణాలుమిటో సరిగ్గా అర్థం చేసుకుంటే.. దీనిని అరికట్టడం సాధ్యమే అని. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
పురుషుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం వంశపారంపర్యం. కుటుంబంలో తండ్రికి లేదా తాతకు బట్టతల ఉంటే, అది పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని మేల్ పాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, క్రమంగా జుట్టు పలచబడటం మొదలవుతుంది. దీనిని పూర్తిగా ఆపలేకపోయినా, ముందుగానే జాగ్రత్త పడితే హెయిర్ ఫాల్‌ను కొంతవరకు ఆపవచ్చు.
Also Read: ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు ఎందుకంత ఇష్టం? ఎందుకంత స్పెషల్?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి జుట్టుకు పెద్ద శత్రువుగా మారింది. అధిక పని ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన పోషణ అందదు. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్త ప్రసరణను తగ్గించి, జుట్టు ఎదుగుదలను దెబ్బతీస్తాయి.
మనం తినే ఆహారం జుట్టు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. జుట్టు పెరగడానికి ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు చాలా అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
స్టైలింగ్ కోసం వాడే జెల్స్, హార్ష్ షాంపూలు, హెయిర్ డ్రైయర్స్ జుట్టులోని సహజ నూనెలను హరిస్తాయి. అతిగా కెమికల్స్ వాడటం వల్ల తల స్కాల్ప్ దెబ్బతింటుంది. ఇది జుట్టు విరిగిపోవడానికి, ఊడిపోవడానికి దారితీస్తుంది. అందేకు జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటూ, సహజమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం, ప్రశాంతమైన నిద్ర మాత్రమే జుట్టును కాపాడుకోవడానికి ఉత్తమ మార్గాలు.
Also Read: టూత్ బ్రష్.. వాటర్ బాటిల్.. పిల్లో.. ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? లేకపోతే ఏమవుతుంది?