E-Paper
Advertisement

Skipping Benefits: బరువు తగ్గాలా? గుండె హెల్దీగా ఉండాలా? అయితే రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి చాలు!

Skipping Benefits: బరువు తగ్గాలా? గుండె హెల్దీగా ఉండాలా? అయితే రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి చాలు!
Advertisement

Skipping Benefits: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం నుంచి మధుమేహం వరకూ ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆఫీస్ పనులు, బిజీ షెడ్యూల్స్ వల్ల అందరికీ జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడే సమయం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లకు వెయిట్ లాస్ అవ్వడానికి స్కిప్పింగ్ ఒక అద్భుతమైన మార్గం. రోజులో కేవలం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే చాలు.. బరువు తగ్గడమే కాకుండా బోలెడన్నీ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యానికి..

మన శరీరానికి స్కిప్పింగ్ అనేది అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది గుండె కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, శరీరమంతా ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

వేగంగా బరువు తగ్గొచ్చు..

Advertisement

జిమ్‌లో చేసే ఇతర వ్యాయామాలతో పోలిస్తే.. స్కిప్పింగ్ తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. ఇది మీ జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం.

Also Read: మీ వాయిస్‌ను బట్టి మీకేమేం రోగాలు ఉన్నాయో చెప్పేసే కొత్త టెక్నాలజీ! ఇది నిజమేనా?

ఎముకలకు బలం..

Advertisement

స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు కాళ్లు, తొడలు, భుజాలు, చేతులపై ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆ కండరాలు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా ఇది ఎముకల సాంద్రతను పెంచి, భవిష్యత్తులో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.

చక్కెర నియంత్రణలో..

రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది. అంతేకాకుండా, శారీరక శ్రమ వల్ల శరీరం అలసిపోయి, రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది.

మానసిక ఒత్తిడి దూరం..

శారీరక ప్రయోజనాలే కాకుండా.. స్కిప్పింగ్ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ వ్యాయామం చేసే సమయంలో శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రోజూవారి దినచర్యలో స్కిప్పింగ్‌ను భాగం చేసుకోమని నిపుణులు చెబుతున్నారు.

Also Read: పీరియడ్స్ టైంలో జ్వరం, నీరసమా? పీరియడ్ ఫ్లూ నుంచి ఉపశమనం పొందే చిట్కాలివే!

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×