E-Paper
Advertisement

Ugadi Pachadi Benefits: ఒక స్పూన్ ఉగాది పచ్చడి.. మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Ugadi Pachadi Benefits: ఒక స్పూన్ ఉగాది పచ్చడి.. మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?
Advertisement

Ugadi Pachadi Benefits: ఉగాది పండగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. మన జీవితంలోని అనేక భావాలను ప్రతిబింబించే ఒక సంప్రదాయం. ఈ పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలో సుఖదుఃఖాలను సూచిస్తాయి. అదే సమయంలో ఈ పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉగాది పచ్చడి తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఉగాది పచ్చడి తెలుగు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రత్యేక వంటకంలో ఆరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు. ఇవి జీవితంలోని అనుభవాలను సూచించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి.

Advertisement

ఉగాది పచ్చడితో కలిగే ప్రయోజనాలు:

1.మొదటిగా..పచ్చడిలో ఉపయోగించే మామిడిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయ పడుతుంది.

Advertisement

2. వేపపువ్వు చేదుగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా , వైరస్‌లను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.

3. బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయ పడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

4. చింతపండు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరం. ఇది గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి తేలికగా అనిపించేలా చేస్తుంది.

5. కారం: కొంత మంది పచ్చడిలో కారం కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల బాడీ మెటబాలిజం పెరుగుంది.

6. ఉప్పు: దీనిలో సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడుతుంది.

ఈ ఆరు రుచులు కలిసి శరీరానికి సమతుల్యతను అందిస్తాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇది సహాయ పడుతుంది.

ఉగాది పచ్చడి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. జీవితంలో సుఖం, దుఃఖం, కోపం, ఆనందం అన్నీ సమానంగా వస్తాయి. వాటిని సమానంగా స్వీకరించాలి అనే తత్వాన్ని ఇది నేర్పుతుంది.

ప్రస్తుత లైఫ్ స్టైల్‌‌ చాలా మంది సంప్రదాయాలను మరిచిపోతున్నారు. కానీ ఉగాది పచ్చడి వంటి సంప్రదాయ వంటకాలు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మొత్తానికి..ఉగాది పచ్చడి కేవలం ఒక వంటకం కాదు. ఇది ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారం అంతే కాకుండా జీవన తత్వాన్ని చెప్పే ఒక గొప్ప సంప్రదాయం. ప్రతి సంవత్సరం ఉగాది రోజు దీన్ని తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×