Athidhi ReRelease: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘అతిథి’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 2007లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, మహేష్ బాబు మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్‌ల వల్ల అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read also-Chinni Serial : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ట్విస్ట్ అదిరిపోయింది..
అప్పట్లో ‘అతిథి’ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ ఫిలింగా నిలిచింది. దర్శకుడు సురేందర్ రెడ్డి మహేష్‌ను అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్ పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేష్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ ఆ కాలానికి చాలా కొత్తగా అనిపించాయి. ఇప్పుడు 4K క్వాలిటీతో వస్తుండటంతో ఆ విజువల్స్ వెండితెరపై మరింత అద్భుతంగా కనిపిస్తాయని భావిస్తున్నారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతిపెద్ద బలం. “ఖబడ్డార్ అని”, “రాత్తరైనా”, “గోన గోన” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల ప్లేలిస్ట్‌లో ఉంటాయి. ఈ పాటల పిక్చరైజేషన్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లో రీ-సౌండ్ మోగించడం ఖాయం. రమేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో అమృతా రావు కథానాయికగా నటించగా, మురళీ శర్మ ప్రతినాయకుడిగా తన నటనతో భయపెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత బ్లాక్ బస్టర్ సినిమాలను రీ-రిలీజ్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్‌మెన్’, ‘మురారి’ చిత్రాలు రీ-రిలీజ్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించాయి. ‘అతిథి’ సినిమాకు అప్పట్లో సరైన గుర్తింపు రాలేదని భావించే ఫ్యాన్స్, ఇప్పుడు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మే 29న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read also-Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్ 2’లో ఆదిత్యధర్ మ్యాజిక్ పనిచేసిందా?.. ఫుల్ రివ్యూ..