E-Paper
Advertisement

Allu Arjun : అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. అదే కారణమా..?

Allu Arjun : అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. అదే కారణమా..?
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా రిలీజ్ అయిన చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారన్న విషయం తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ లాగే అల్లు అర్జున్ కూడా మొదటి రోజే సినిమాలను చూసి ఆ సినిమాకు రివ్యూ ఇస్తాడు. గతంలో చాలా సినిమాలకే బన్నీ రివ్యూ ఇచ్చాడు. ఆయన పాజిటివ్ వేలో ఇచ్చిన సరే కొన్నిసార్లు అవి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. తాజాగా ఆయన ఓ స్టార్ హీరో మూవీకి రివ్యూ ఇచ్చాడు.. దాని కారణంగా బన్నీ పై ట్రోల్స్ వినిపిస్తున్నాయని తెలిసిందే.. అసలు అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చిన మూవీ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘దురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ..

ఉగాది కానుకగా రిలీజ్ అయిన బాలీవుడ్ హీరో నటించిన దురంధర్ 2 మూవీని హీరో అర్జున్ చూశారు. ఆ మూవీ ఎలా ఉంది అనే దానిపై తన అభిప్రాయాన్ని తన ‘X’ వేదికగా పంచుకున్నారు. అందులో ఏముందంటే.. మన దేశంలో రణ్‌వీర్ సింగ్ వంటి వెర్సటైల్ నటుడు ఉన్నందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ నటన నిప్పు కణికలా ఉందని.. తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకొని వెళ్లారని బన్నీ ప్రశంసలు కురిపించాడు.. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కూడా అల్లు అర్జున్ ఆకాశానికెత్తారు. ఆదిత్య ధర్ ఈ సినిమాతో బంతిని స్టేడియం దాటించేశారని .. మనదేశంలో ఇలాంటి ప్రతిభావంతులు ఉండడం వల్లే సినిమా యొక్క ఖ్యాతి పెరుగుతుంది అని బన్నీ రాశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ట్విస్ట్ అదిరిపోయింది..

బన్నీ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

Advertisement

ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా పై ఇప్పటికే రివ్యూలు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటుగా మిక్స్డ్ టాక్ కూడా ఒకవైపు వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.. అయితే బన్నీ ఈ సినిమాని చూడకుండా బాలీవుడ్ హీరో సినిమా ని చూడడం ఏంటి? అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది.. సొంతం మామ సినిమాపై ఎటువంటి రివ్యూ కూడా ఇవ్వకుండా బాలీవుడ్ సినిమా పై రివ్యూ ఇవ్వడం ఎందుకు అని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ గొడవలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా? లేదా? ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా? అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన 22వ సినిమా తమిళ డైరెక్టర్ అయిన అట్లీతో చేస్తున్నాడు.. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×