E-Paper
Advertisement

Unexplained weight loss: ఉన్నట్టుండి బరువు తగ్గారా ? అస్సలు లైట్ తీసుకోవద్దు

Unexplained weight loss: ఉన్నట్టుండి బరువు తగ్గారా ? అస్సలు లైట్ తీసుకోవద్దు
Advertisement

Unexplained Weight Loss: కారణం లేకుండా శరీర బరువు తగ్గడంఅనేది ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సాధారణంగా ఆహార నియమాలు పాటించకుండా లేదా వ్యాయామం పెంచకుండానే.. ఆరు నెలల కాలంలో మీ శరీర బరువులో 5% కంటే ఎక్కువ తగ్గితే దానిని ఆందోళనకరమైన విషయంగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా బరువు తగ్గడానికి దారితీసే ముఖ్యమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. జీవక్రియ సమస్యలు:

థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేయడం వల్ల శరీరంలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీని వల్ల ఆకలి ఎక్కువగా ఉన్నప్పటికీ బరువు తగ్గుతారు.

Advertisement

మధుమేహం: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు.. శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేకపోతుంది. దీని వల్ల కండరాలు, కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు.

2. జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు:

సిలియాక్ వ్యాధి లేదా Crohn’s Disease: పేగులకు సంబంధించిన సమస్యల వల్ల మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు . దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడి బరువు తగ్గుతారు.

అల్సర్లు: కడుపులో అల్సర్లు ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం కష్టంగా మారి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

3. మానసిక ఆరోగ్య కారణాలు:

ఒత్తిడి, ఆందోళన : తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఆకలి మందగిస్తుంది. కొందరిలో జీర్ణక్రియ వేగం పెరిగి బరువు తగ్గుతారు.

డిప్రెషన్: తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు ఆహారంపై ఆసక్తి తగ్గిపోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.

4. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, వ్యాధులు;

క్యాన్సర్: వివరించలేని బరువు తగ్గడం అనేది కొన్ని రకాల క్యాన్సర్లకు (ముఖ్యంగా ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్) ప్రాథమిక సంకేతం కావచ్చు.

క్షయ (TB) & HIV: దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు శరీర రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫలితంగా కండరాలు బలహీనపడి బరువు తగ్గుతారు.

Also Read: పెరుగు, ఇడ్లీ, మజ్జిగ..చలికాలంలో ఇవి ఎందుకు అమృతంలా పనిచేస్తాయి ?

5. ఇతర కారణాలు:

మందుల ప్రభావం: కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఆకలి తగ్గడం లేదా వికారం కలగడం వల్ల బరువు తగ్గుతారు.

పంటి సమస్యలు: వృద్ధులలో నమలడం కష్టంగా ఉన్నప్పుడు ఆహారం తక్కువగా తీసుకుంటారు.ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఎప్పుడు డాక్టర్‌‌ని సంప్రదించాలి ?

మీరు ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గుతున్నట్లయితే.. దానితో పాటు ఈ క్రింది లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

నిరంతరం అలసటగా అనిపించడం.

జ్వరం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం.

ఆకలి పూర్తిగా తగ్గిపోవడం.

మలవిసర్జన అలవాట్లలో మార్పులు రావడం.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×