E-Paper
Advertisement

Fermented Food In Winter: పెరుగు, ఇడ్లీ, మజ్జిగ..చలికాలంలో ఇవి ఎందుకు అమృతంలా పనిచేస్తాయి ?

Fermented Food In Winter: పెరుగు, ఇడ్లీ, మజ్జిగ..చలికాలంలో ఇవి ఎందుకు అమృతంలా పనిచేస్తాయి ?
Advertisement

Fermented Food In Winter: చలికాలంలో మనం అనేక ఆరోగ్య సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణక్రియ మందగించడం, చర్మం పొడిబారడం వంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మనం రకరకాల మందులు వాడుతుంటాం. అయితే.. మన వంటగదిలోనే ఉండే ‘ఫెర్మెంటెడ్ ఫుడ్స్’ (పులియబెట్టిన ఆహారాలు) ఈ సీజన్‌లో అసలైన ‘గేమ్ ఛేంజర్’ అని మీకు తెలుసా? పెరుగు, మజ్జిగ, కిమ్చీ, లేదా ఇడ్లీ-దోశ వంటి పులియబెట్టిన పిండితో చేసిన ఆహారాలు శరీరానికి అద్భుతమైన శక్తిని, రక్షణను ఇస్తాయి. చలికాలంలో ఇవి ఎందుకు అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

చలికాలంలో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పులియబెట్టిన ఆహారాలు అంటే సహజమైన ప్రక్రియ ద్వారా ‘మంచి బ్యాక్టీరియా’ అభివృద్ధి చెందిన పదార్థాలు. ఇవి చలికాలంలో మన శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తాయి.

Advertisement

1. రోగనిరోధక శక్తికి శ్రీరామ రక్ష:

చలికాలంలో గాలి ద్వారా వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియా మనపై త్వరగా దాడి చేస్తాయి. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిలో దాదాపు 70-80% భాగం పేగుల్లోనే ఉంటుంది. పులియబెట్టిన ఆహారాల్లో ఉండే ప్రోబయోటిక్స్ ఈ పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల తెల్ల రక్త కణాల పనితీరు మెరుగు పడి, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు.

2. నెమ్మదించిన జీర్ణక్రియకు ఊతం:

చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం ‘లేజీ’గా మారుతుంది. దీంతో జీవక్రియ కూడా మందగిస్తుంది. పైగా ఈ సమయంలో మనం నూనె వస్తువులు, మసాలా వంటకాలు ఎక్కువగా తింటాం. పులియబెట్టిన ఆహారాలు మనం తిన్న ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేసి.. ప్రోటీన్లను, విటమిన్లను శరీరం గ్రహించేలా చేస్తాయి. ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

3. విటమిన్ల గని:

ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఆహారంలోని పోషక విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా.. విటమిన్-B12, విటమిన్-K2 వంటి పోషకాలు చలికాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. విటమిన్-B12 లోపం వల్ల కలిగే బద్ధకాన్ని పోగొట్టి.. రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఈ ఆహారాలు చూస్తాయి.

4. వింటర్ బ్లూస్ నుంచి ఉపశమనం:

చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల కొందరిలో మానసిక ఒత్తిడి లేదా విచారం కలుగుతుంది. మన పేగు ఆరోగ్యానికి.. మెదడుకు నేరుగా సంబంధం ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగులు సెరోటోనిన్ (హ్యాపీ హార్మోన్) ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మన మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.

5. చర్మ సంరక్షణ:

లోపల మలినాలు పేరుకుపోవడం వల్ల చర్మంపై మొటిమలు, పొడిబారడం జరుగుతుంది. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ శరీరాన్ని డిటాక్స్ చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీని వల్ల చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.

Also Read: మీ ఆరోగ్యం ఎలా ఉందో గోళ్లే చెబుతాయి.. ఈ లక్షణాలను గమనించండి !

చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు:

పెరుగు/మజ్జిగ: మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది.

కిమ్చీ/సౌర్‌క్రాట్: వీటిలో విటమిన్-సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

పులియబెట్టిన  వంటలు: ఇడ్లీ, దోశ వంటివి తేలికగా జీర్ణమవుతాయి.

కాన్జీ : నల్ల క్యారెట్లు లేదా బీట్‌రూట్‌తో చేసే ఈ డ్రింక్ వింటర్‌లో అద్భుతంగా పనిచేస్తుంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×