E-Paper
Advertisement

Artificial Lung System: వైద్య రంగంలో అద్భుతం.. ఊపిరితిత్తులు లేకుండానే రెండు రోజుల పాటు ప్రాణాలతో!

Artificial Lung System: వైద్య రంగంలో అద్భుతం.. ఊపిరితిత్తులు లేకుండానే రెండు రోజుల పాటు ప్రాణాలతో!
Advertisement

Artificial Lung System: మెడికల్ హిస్టరీలోనే ఒక అద్భుతం జరిగింది. ఊపిరితిత్తులు లేకుండా ఒక మనిషి రెండు రోజుల పాటు ప్రాణాలతో ఉన్నాడంటే నమ్మగలరా? చికాగో డాక్టర్లు చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడి రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలకు ఇది ఒక గొప్ప ఆశాకిరణం. ఈ అద్భుత వైద్య ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని చికాగోలో వైద్య చరిత్రను తిరగరాసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న ఒక వ్యక్తికి, ఆ అవయవాలను తొలగించి కూడా రెండు రోజుల పాటు అతడిని ప్రాణాలతో నిలిపారు. ఆధునిక “టోటల్ ఆర్టిఫిషియల్ లంగ్” వ్యవస్థను ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేస్తూ, ఊపిరితిత్తుల మార్పిడి జరిగే వరకు అతడిని కాపాడారు. ఊపిరితిత్తుల వ్యాధులు, వాయు కాలుష్యం అధికంగా ఉండే మన దేశంలో ఈ సాంకేతికత ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.

Advertisement

ఊపిరితిత్తులు లేకుండా బతకడం ఎలా సాధ్యం?
సాధారణంగా మనిషికి ఊపిరితిత్తులు ఆగిపోతే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ చికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ వైద్యులు 30 ఏళ్ల ఒక రోగి విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పేషెంట్ ఊపిరితిత్తులు తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా ద్రవ రూపంలోకి మారిపోయాయి. ఆ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకకుండా ఉండాలంటే వాటిని వెంటనే తొలగించడం ఒక్కటే మార్గం. కానీ ఊపిరితిత్తులు తీసేస్తే గుండె కుప్పకూలిపోతుంది.

‘టోటల్ ఆర్టిఫిషియల్ లంగ్’ సిస్టమ్:
డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలోని బృందం ఒక వినూత్న పరిష్కారాన్ని ఆలోచించింది. వారు రోగి శరీరం వెలుపల 25 భాగాలతో కూడిన ఒక కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన ఊపిరితిత్తులు చేసే పనిని (ఆక్సిజన్‌ను అందించడం, కార్బన్ డయాక్సైడ్‌ను తీసేయడం) ఈ మెషిన్ చేసింది. ఇది రక్తాన్ని గుండె కుడి వైపు నుంచి తీసుకుని, శుద్ధి చేసి, మళ్ళీ ఎడమ వైపునకు పంపిస్తుంది.

Advertisement

Also Read: మనం ఎందుకు ప్రేమలో పడతాం? సైన్స్ వెనక ఉన్న అసలు ‘స్కెచ్’ ఇదే!

సెలైన్ ఇంప్లాంట్స్ తో గుండెకు సపోర్ట్:

ఊపిరితిత్తులను తీసేసినప్పుడు ఛాతి లోపల ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ వల్ల గుండె పక్కకు జరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి డాక్టర్లు ఒక విచిత్రమైన పద్ధతిని అనుసరించారు. తాత్కాలికంగా సెలైన్ నింపిన బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌ను ఛాతిలో అమర్చి, గుండె స్థిరంగా ఉండేలా చూశారు. రెండు రోజుల తర్వాత సరైన దాత నుంచి ఊపిరితిత్తులు దొరకగానే, ఆ ఇంప్లాంట్స్ తీసేసి అవయవ మార్పిడి పూర్తి చేశారు.

భారతదేశానికి ఇది ఎందుకు ముఖ్యం?
భారత్‌లో వాయు కాలుష్యం, టీబీ (TB), న్యుమోనియా వంటి సమస్యల వల్ల అంతే కాకుండా లంగ్స్ ఫెయి్యూర్ చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో అవయవ దాతలు దొరకడం చాలా ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి సమయంలో ఈ కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థరోగులకు కొన్ని రోజుల పాటు ప్రాణవాయువును అందిస్తూ, అవయవ దాత దొరికే వరకు సమయాన్ని ఇస్తుంది.

భవిష్యత్తుపై ఆశలు:
ప్రస్తుతానికి ఇది చాలా ఖరీదైన, క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ.. భవిష్యత్తులో ఇది మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెంటిలేటర్లు, ఎక్మో మెషిన్ల కంటే ఇది ఒక అడుగు ముందడుగు. ఇది కేవలం తాత్కాలిక సాయమే కాకుండా.. భవిష్యత్తులో మొబైల్ లేదా ధరించగలిగే కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి మార్గం సుగమం చేస్తోంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×