E-Paper
Advertisement

Ashwagandha for Hair: అశ్వగంధ పొడిని ఇలా వాడారంటే జుట్టు పెరగడమే కాదు, ఊడదు కూడా

Ashwagandha for Hair: అశ్వగంధ పొడిని ఇలా వాడారంటే జుట్టు పెరగడమే కాదు, ఊడదు కూడా
Advertisement

ప్రాచీన ఆయుర్వేద ఔషధంగా ప్రసిద్ధి చెందింది అశ్వగంధ. ఇది కేవలం ఆరోగ్యాన్ని కాదు… అందమైన జుట్టును కూడా అందిస్తుంది. జుట్టు కోసం అశ్వగంధను ఇంట్లో ఎలా ఉపయోగించాలి? నిజంగా ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుందా?

అశ్వగంధ అనేది శరీర బలాన్ని పెంచే, ఒత్తిడిని తగ్గించే ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పకుంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతున్నవారికి అశ్వగంధ ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒత్తిడి తగ్గితే జుట్టు రాలడం కూడా కొంతవరకు తగ్గవచ్చు.

Advertisement

అశ్వగంధ హెయిర్ మాస్క్
అశ్వగంధను ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. మొదటగా అశ్వగంధ పొడితో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్లు అశ్వగంధ పొడిని తీసుకుని, అందులో కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మానికి పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది తల చర్మానికి పోషకాలు అందించడంలో సహాయపడుతుంది.

మరో విధానం అశ్వగంధ ఆయిల్. కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో అశ్వగంధ పొడిని కలిపి ఒక రోజు ఉంచాలి. ఆ తరువాత ఆ నూనెతో తలకు మసాజ్ చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా ఉంటే జుట్టు రూట్లు బలపడే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక సులభమైన పద్ధతి అశ్వగంధ నీటితో తల శుభ్రం చేసుకోవడం. కొద్దిగా అశ్వగంధ పొడిని నీటిలో మరిగించి చల్లారిన తర్వాత షాంపూ చేసిన వెంటనే ఆ నీటితో తల కడగాలి. ఇది తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Advertisement

అశ్వగంధను అలోవేరా జెల్‌తో కలిపి కూడా మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమం తల చర్మానికి తేమనిచ్చి పొడిబారకుండా కాపాడుతుంది. తల చర్మం ఆరోగ్యంగా ఉంటే జుట్టు కూడా బలంగా ఉంటుంది. అశ్వగంధను లోపల నుంచి కూడా తీసుకోవచ్చు. కొందరు అశ్వగంధ పొడిని పాలలో లేదా టీ లో కలిపి తాగుతారు. మరికొందరు క్యాప్సూల్ రూపంలో తీసుకుంటారు. అయితే ఇలా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

Also read: Brinjal fry: వంకాయ పొడి కూర ఎప్పుడైనా ప్రయత్నించారా? రెసిపీ ఇదిగో

అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అశ్వగంధను ఉపయోగిస్తే వెంటనే జుట్టు వేగంగా పెరుగుతుందని భావించడం సరైంది కాదు. ఇది మాంత్రిక ఔషధం కాదు. జుట్టు ఆరోగ్యం అనేది సరైన ఆహారం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, తల సంరక్షణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతే లేదా తలలో సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. స్వయంగా మందులు వాడటం కంటే నిపుణుల సలహా తీసుకోవడం సురక్షితం.

అశ్వగంధ తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే గుణాలు కలిగి ఉంది. ఇంట్లోనే సులభంగా ఉపయోగించే పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ దీన్ని ఓపికగా, ఎక్కువ కాలం పాటూ ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు అశ్వగంధను ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×