E-Paper
Advertisement

Romantic drama OTT: భర్త పోయాక మరొకరితో… ఎవరూ చూడకుండా ఒకే గదిలో… సింగిల్స్ కు మాత్రమే

Romantic drama OTT: భర్త పోయాక మరొకరితో… ఎవరూ చూడకుండా ఒకే గదిలో… సింగిల్స్ కు మాత్రమే
Advertisement

Romantic drama OTT : సినిమాలను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తో పాటు సోషల్ మెసేజ్ ని కూడా ఇస్తాయి. అలాంటి మూవీనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ మూవీ ప్రధానంగా ఇస్లామిక్ ఆచారం నేపథ్యంలో సాగుతుంది. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న ఒక ముస్లిం మహిళకి, అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ తమిళ సినిమా పేరు ‘బుర్ఖా’ (Burqa). సర్జున్ కె.ఎం. దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కలైయరసన్, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అవ్వడంతో పాటు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలలో అవార్డులకు నామినేషన్లు కూడా పొందింది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న నేరుగా ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నజ్మా అనే ఒక ముస్లిం నర్సు భర్త ఉన్నట్టుండి చనిపోతాడు. వాళ్ళ మత ఆచారం ప్రకారం ‘ఇద్దా’ అనే ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం కొన్ని నెలల పాటు ఆమె ఏ పరాయి మగాడిని చూడకూడదు. అసలు గడప దాటి బయటకు కూడా రాకూడదు. అలా ఆమె ఒక గదికే పరిమితమై బాధలో ఉంటుంది. సరిగ్గా అదే టైంలో బయట గొడవలు జరిగి, దెబ్బలు తిన్న సూర్య అనే వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమె ఇంట్లో దాక్కుంటాడు. నజ్మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క మత ఆచారాలు, ఇంకో పక్క ప్రాణాపాయంలో ఉన్న మనిషి. కానీ ఒక నర్సుగా ఆమె ఈ నియమాలను పక్కన పెట్టి అతనికి వైద్యం చేస్తుంది. ఆ రాత్రంతా వాళ్లిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు కూడా . చివరికి ఆ రాత్రి అక్కడ ఏం జరుగుతుంది ? ఈ విషయం బయట తెలుస్తుందా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×