E-Paper
Advertisement

మీ బెడ్‌రూంలో చీపురు పెట్టుకున్నారా? వాస్తు ప్రకారం ఈ సమస్యలకు కారణం అదే

మీ బెడ్‌రూంలో చీపురు పెట్టుకున్నారా? వాస్తు ప్రకారం ఈ సమస్యలకు కారణం అదే
Advertisement

Vastu Tips For Broom: ఇంట్లో పరిశుభ్రతకు ప్రధాన సాధనం చీపురు. అయితే వాస్తు ప్రకారం చీపురు ఇంట్లో ఒక ప్రత్యేక స్థానంలో ఉంచాలి. లేకపోతే లేని సమస్యలు వస్తాయి. అయితే చాలామంది మధ్యతరగతి, పేద తరగతి ప్రజలు ఇంట్లో తక్కువ స్థలం కారణంగా పడకగదిలోనే చీపురు పెట్టేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ఈ అలవాటు అశుభకరం. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. తప్పుడు ప్రదేశంలో చీపురు ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి ప్రభావితమవుతాయి. వాస్తు ప్రకారం.. చీపురు ఒక సాధారణ శుభ్రపరిచే సాధనం మాత్రమే కాదు. అది ఇంట్లో శక్తి ప్రవాహం, సంపదతో ముడిపడి ఉందని నమ్ముతారు.

బెడ్‌రూంలో చీపురు ఉంచడం వలన సంబంధాలపై ప్రభావం

బెడ్‌రూం.. దాంపత్య ప్రేమ, సౌకర్యం, భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది. అక్కడ చీపురు ఉంచడం ఈ సమతుల్యతను దెబ్బతీస్తుందని వాస్తు విశ్వాసం. చీపురు కారణంగా దంపతులు అనవసరమైన వాగ్వాదాలు ఎదుర్కోవచ్చు. ఇద్దిర మధ్య చిన్న అపార్థాలు నెమ్మదిగా పెద్ద విభేదాలుగా మారవచ్చు. ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి భాగస్వాముల మధ్య మానసిక దూరాన్ని సృష్టించగలదు. ఇది ఇంట్లో శాంతిని, సామరస్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు రావచ్చు

Advertisement

రోజంతా కష్టపడ్డాక పడకగది ఒక విశ్రాంతి ప్రదేశం. అయితే చీపురు వలన అశాంతి కలిగించే శక్తి ఏర్పడుతుందని వాస్తు నమ్మకం. ఇది ఒత్తిడిని, మానసకింగా అసౌకర్యాన్ని పెంచవచ్చు. కొంతమంది నిద్ర భంగం కూడా అనుభవించవచ్చు. ఇంకా, సాంప్రదాయ నమ్మకాలు చీపురును సంపదతో ముడిపెడతాయి. తప్పుడు స్థలంలో ఉంచడం వలన ఆర్థిక అస్థిరత, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని చెబుతారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం.. ఇది లక్ష్మీదేవికి అగౌరవంగా కూడా పరిగణించబడుతుంది.

Also Read: మీ పిల్లాడిని చెడు స్నేహితుల నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ కోసమే

ఆరోగ్య సమస్యలు కూడా

Advertisement

చీపురు వల్ల దుమ్ము, ధూళి, క్రిములు బెడ్‌రూంలో వస్తాయి. పడకగది తెరిచి ఉంచడం వల ప్రభావితం చేస్తుంది. దుమ్ము కణాల కారణంగా అలర్జీలు, శ్వాసకోశ సమస్యలను ప్రేరేపించవచ్చు. పిల్లలు, వృద్ధులు ఎక్కువ ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటారు. విశ్రాంతి తీసుకునే పడకగది పరిశుభ్రంగా ఉండాలి. విశ్రాంతి వల్ల శరీరం మెల్లగా రిపేర్ అవుతుంది. అందుకే మంచి ఆరోగ్యం కోసం చీపురు అక్కడ ఉండకూడదు.

చీపురును ఎక్కడ ఉంచాలి?

చీపురును ఇంట్లో కనిపించిన మూలాల్లో ఉంచాలని వాస్తు సూచిస్తుంది. అతిథులు లేదా సందర్శకులకు చీపురు కనిపించేలా ఉంచకూడదు. నైరుతి లేదా పడమర దిశలు చీపురు పెట్టడానికి అనుకూలమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య దిశలో అసలు పెట్టకూడదు. మంచం దగ్గర లేదా డబ్బు పెట్టెల దగ్గర చీపురు ఉంచవద్దు. అలాగే ప్రార్థనా స్థలాలకు కూడా దూరంగా ఉంచాలి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×