E-Paper
Advertisement

పెళ్లి పై తరుణ్ భాస్కర్ కామెంట్స్..త్వరలోనే పప్పన్నం పెట్టనున్నారా?

పెళ్లి పై తరుణ్ భాస్కర్ కామెంట్స్..త్వరలోనే పప్పన్నం పెట్టనున్నారా?
Advertisement

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ పరిచయం అవసరం లేని పేరు. పెళ్లి చూపులు సినిమాకు దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఒకవైపు దర్శకుడుగా కొనసాగుతూనే మరోవైపు నటుడుగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకు పలు సినిమాలలో కీలక పాత్రలలో కనిపించిన తరుణ్ భాస్కర్ ఇటీవల ఈషా రెబ్బతో కలిసి ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే గాయపడ్డ సింహం(Gaayapadda Simham) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తరుణ్ భాస్కర్ పెళ్లిపై సుమ కామెంట్స్..

ఈ సినిమా మే ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్ పాల్గొనలేకపోయారు.. ఈ నేపథ్యంలోనే తరుణ్ భాస్కర్ తల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సుమ తరుణ్ భాస్కర్ తల్లితో మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ మాకు ఎప్పుడు పప్పన్నం పెడుతున్నారు అంటూ తన పెళ్లి గురించి అడిగారు.

ఈషా రెబ్బతో తరుణ్ భాస్కర్ రిలేషన్..

Advertisement

సుమ ఇలా తరుణ్ భాస్కర్ తల్లిని అడగటమే కాకుండా ఏకంగా వీడియో కాల్ చేసి మరి తరుణ్ భాస్కర్ తో మాట్లాడారు. వీసా లేని కారణంగా తరుణ్ రాలేకపోయారు అంటూ ఫన్నీగా మాట్లాడిన సుమ ఇక్కడ అమ్మగారు పప్పన్నం ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు అంటూ పెళ్లి గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తరుణ్ భాస్కర్ సమాధానం చెబుతూ అమ్మకు ప్రతిరోజు పప్పన్నం పెడుతున్నాను కదా అంటూ సమాధానం ఇవ్వడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మొదటి భార్య నుంచి విడాకులు అవ్వలేదా..

Advertisement

తరుణ్ భాస్కర్ ఇది వరకే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే . తన మొదటి భార్య నుంచి విడాకులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈయన తన తదుపరి రిలేషన్ గురించి ఎక్కడ స్పందించలేదు. అయితే తాను మాత్రం ప్రేమలో ఉన్నాననే విషయాన్ని పలు సందర్భాలలో పరోక్షంగా బయటపెట్టిన ఈయన త్వరలోనే పెళ్లికి సంబంధించిన విషయాన్ని చెబుతానని వెల్లడించారు. మరి తరుణ్ భాస్కర్ ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారనేది తెలియాల్సి ఉంది. తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ నేరుగా వీరి రిలేషన్ గురించి చెప్పకపోయినా పలు సందర్భాలలో కలిసి పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం జంటగా బయటకు వెళ్లడం వంటి వాటి ద్వారా వారి రిలేషన్ బయటపెట్టారు.

Also Read: విడాకుల తర్వాత 5 ఏళ్ళు నరకం చూసా.. ఆవేదన చెందిన కార్తీక దీపం సుమిత్ర !

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×