E-Paper
Advertisement

Eesha Rebba: స్ట్రెస్ ఎక్కువంటే తాగుతాను.. ఆల్కహాల్ అలవాటుపై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

Eesha Rebba: స్ట్రెస్ ఎక్కువంటే తాగుతాను.. ఆల్కహాల్ అలవాటుపై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Advertisement

Eesha Rebba: ఈషా రెబ్బా పరిచయం అవసరంలేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ల ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈషా త్వరలోనే ఓం శాంతి శాంతి శాంతి (Om Shanti Shanti Shanti)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.A.R సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా సందడి చేయబోతున్నారు. ఇలా తరుణ్ భాస్కర్(Tharun Bhascker) ఈషా రెబ్బ జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా డైరెక్ట్ గా అడిగేస్తున్నారా?

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా రెబ్బాకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీది ఏ బ్రాండ్ అంటూ ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా? అని ప్రశ్న ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తాను గత కొంతకాలంగా హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను ఎక్కడికి వెళ్లినా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతానని తెలియజేశారు. అన్ని రకాల ఫుడ్ తీసుకుంటాను కానీ క్యాలరీస్ మైంటైన్ చేస్తుంటానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఆల్కహాల్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈ మధ్యకాలంలో ఇలా డైరెక్ట్ గా కూడా అడిగేస్తున్నారా? అంటూ మాట్లాడారు.

స్ట్రెస్ అయితే తాగే అలవాటు ఉంది..

Advertisement

తాను ఆల్కహాల్ చాలా వరకు తీసుకోనని అయితే ఏదైనా వర్క్ పరంగా చాలా స్ట్రెస్ అనిపించినప్పుడు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈషా ఈ విషయాన్ని తెలియ చేయడంతో ఏంటి మీరు కూడా ఆల్కహాల్ తీసుకుంటారా? ఇలాంటి అలవాటు కూడా ఉందా? అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇలా ఆల్కహాల్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే ఆల్కహాల్ తీసుకునేవారు కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అమ్మాయిలు కూడా పార్టీలలో ఆల్కహాల్ తీసుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.

తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఈషా రెబ్బా…

Advertisement

ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలామందికి ఇలాంటి అలవాటు ఉన్నప్పటికీ బయట పెట్టడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఈసారి ఇబ్బ మాత్రం తనకు స్ట్రెస్ ఉన్నప్పుడు తాగుతానని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఇటీవల త్రీ రోజెస్ సీజన్ 2 సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఓంశాంతి శాంతి శాంతి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె తరుణ్ భాస్కర్ తో కలిసి నటించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Also Read; The Rajasaab Collections: కష్టాలలో ప్రభాస్ ది రాజసాబ్.. నిర్మాతకు భారీ నష్టాలు..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×