E-Paper
Advertisement

Birds V Rormation: పక్షులేమీ పిచ్చివి కావు.. ఆకాశంలో V షేప్‌లో ఎందుకు వెళ్తాయో తెలిస్తే.. వాటి తెలివికి ఫిదా అయిపోతారు!

Birds V Rormation: పక్షులేమీ పిచ్చివి కావు.. ఆకాశంలో V షేప్‌లో ఎందుకు వెళ్తాయో తెలిస్తే.. వాటి తెలివికి ఫిదా అయిపోతారు!
Advertisement

Birds V Rormation: మీరు ఎప్పుడైనా గమనించారా? ఆకాశంలో పక్షులు గుంపులుగా కాకుండా.. V ఆకారంలో వెళ్తుంటాయి. ఆ దృశ్యం చూడటానికి భలే ముచ్చటగా అనిపిస్తుంటుంది కదూ! అయితే.. ఈ ప్రయాణం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉందని మనలో చాలామందికి తెలియదు. వేల మైళ్ల దూరం అలసిపోకుండా సాగే ఈ వలస పక్షుల ప్రయాణ రహస్యాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి..

గాలిని జయించే ‘ఏరోడైనమిక్స్’:

పక్షులు V ఆకారంలో ఎగిరినప్పుడు గాలిని సులువుగా ఎదుర్కోగలవు. ముందున్న పక్షి రెక్కలు ఆడించినప్పుడు దాని వెనుక గాలిలో ఒక రకమైన అప్‌వాష్(Upwash) కలుగుతుంది. అంటే.. గాలి పైకి లేస్తుంది. దీంతో వెనుక ఉండే పక్షి సరిగ్గా ఆ పైకి లేచే గాలి ప్రవాహంలో తనను తాను సెట్ చేసుకుంటుంది. తద్వారా ఆ పక్షి ఎక్కువ కష్టపడకుండానే గాలిలో ఎగిరిపోతుంటుంది.

Advertisement

Also Read: అయోధ్యలో కొరియా రాణి విగ్రహం.. 2000 ఏళ్లనాటి చారిత్రక బంధం వెనుకున్న కథేంటో తెలుసా?

అద్భుతమైన శక్తి ఆదా:

ఒంటరిగా ఎగిరే పక్షితో పోలిస్తే.. ఇలా సమూహంగా ఎగిరే పక్షులు దాదాపు 20% నుండి 30% వరకు తక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. ఈ టెక్నిక్ వల్ల వాటి గుండెపై ఒత్తిడి తగ్గడమే కాకుండా శ్వాస తీసుకోవడంలోనూ సులభమవుతుంది. అందుకే విమానయాన రంగంలో యుద్ధ విమానాలు కూడా ఇంధనాన్ని ఆదా చేయడానికి ఇదే ఫార్మేషన్ ఫ్లయింగ్ పద్ధతిని పాటిస్తాయి.

నిజమైన టీమ్ వర్క్:

Advertisement

గుంపులో అందరికంటే ముందు ఉండే పక్షికి గాలి తీవ్రత నేరుగా తగులుతుంది. కాబట్టి.. అది త్వరగా అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అది కొద్దిసేపు లీడర్‌గా ఉన్నాక, వెనక్కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. వెంటనే మరో పక్షి ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇలా ఒకదానికొకటి సహకరించుకుంటూ అవి లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఈ విధానం ద్వారా బాధ్యత, నాయత్వం అంటే ఏమిటో మనకు నేర్పుతుంది.

రక్షణతో పాటు సమన్వయం:

పక్షుల ప్రయానం V ఆకారంలో ఉండటం వల్ల ప్రతి పక్షికి తన ముందున్న పక్షి కనిపిస్తుంది. దీనివల్ల గాలిలో ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉండదు. అంతేకాదు.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసేందుకు వీలుగా పక్షులకు విశాలమైన దృష్టి లభిస్తుంది. దీనివల్ల ప్రమాదకరమైన పక్షుల నుండి తమ గుంపును రక్షించుకోవడం సులభమవుతుంది.

పక్షులు దిశను ఎలా గుర్తిస్తాయి?

పక్షులు కేవలం వాటి కంటి చూపు మీద మాత్రమే ఆధారపడవు. పక్షుల కళ్లు, మెదడులో భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. అంటే.. వాటి మెదడులో ఒక కాంపస్ ఉన్నట్లు అన్నమాట. దీని సాయంతో ఉత్తర, దక్షిణ దిశలను అవి సులభంగా గుర్తిస్తాయి. పగటిపూట ప్రయాణించే పక్షులు సూర్యుడి స్థానాన్ని బట్టి దారి తెలుసుకుంటే.. రాత్రివేళ ప్రయాణించే పక్షులు నక్షత్రాల అమరికను చూసి తమ గమ్యాన్ని చేరుకుంటాయి. అలాగే.. పక్షులకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ప్రయాణించే దిశలో ఉండే పర్వతాలు, నదులు, తీర ప్రాంతాలను అవి గుర్తు పెట్టుకుంటాయి. ఒకసారి వెళ్లిన దారిని మళ్లీ మర్చిపోకుండా గుర్తుపట్టగలవు.

Also Read: ఏడాదిలో 5 రోజులు ఆ గ్రామ స్త్రీలు నగ్నంగానే ఉండాలి.. నిబంధన అతిక్రమిస్తే ఏం జరుగుతుందంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×