E-Paper
Advertisement

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి
Advertisement

Vastu tips for main door: ఇంట్లోకి సిరిసంపదలు, సానుకూల శక్తి ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం ఎంతో కీలకం. వాస్తు శాస్త్రం ప్రకారం.. మెయిన్ డోర్ అనేది కేవలం దారి మాత్రమే కాదు, ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. అయితే.. చాలా మంది తెలియక ప్రధాన ద్వారం దగ్గర కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి అనవసర గొడవలు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. మరి మెయిన్ డోర్ దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ? దీనికి సంబంధించి వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

మెయిన్ డోర్ దగ్గర ఈ 7 వస్తువులు ఉండకూడదు!

Advertisement

ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ శుభ్రంగా.. ప్రశాంతంగా ఉండాలి. వాస్తు ప్రకారం మెయిన్ డోర్ దగ్గర కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అవేంటంటే..

1. చెత్త కుండీలు :

Advertisement

చాలామంది ఇంటి మెయిన్ డోర్ పక్కనే లేదా గుమ్మం ఎదురుగా చెత్త డబ్బాలను పెడుతుంటారు. వాస్తు ప్రకారం.. ఇది అత్యంత అశుభం. మెయిన్ డోర్ దగ్గర చెత్త ఉండటం వల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

2.ముళ్ళ మొక్కలు, బోన్సాయ్ చెట్లు:

ఇంటి గుమ్మం దగ్గర రోజ్ వంటి ముళ్ళ.. మొక్కలను లేదా బోన్సాయ్ చెట్లను పెంచకూడదు. ముళ్ళ మొక్కలు ఇంట్లో వాదనలు, మనస్పర్థలను పెంచుతాయి. వీటికి బದಲು గుమ్మం దగ్గర అందమైన పూల మొక్కలు లేదా.. మనీ ప్లాంట్ వంటివి ఉంచడం శుభ్రతను, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

3. విరిగిన లేదా పగిలిన వస్తువులు:

మెయిన్ డోర్ వద్ద లేదా మెట్ల కింద విరిగిన ఫర్నిచర్, పగిలిన కుండీలు లేదా పాత చెక్క సామాగ్రిని ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఇంట్లోకి దరిద్రం, దురదృష్టాన్ని ఆహ్వానిస్తాయి. గుమ్మం ప్రాంతం ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలి.

4. చెప్పుల స్టాండ్ :

చాలా ఇళ్లలో మెయిన్ డోర్ దగ్గరే.. చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. మెయిన్ డోర్ పక్కన చెప్పులు విప్పడం లేదా షూ రాక్ పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. చెప్పులను ఎప్పుడూ గుమ్మం వెలుపల లేదా వేరే ప్రదేశంలో అమర్చాలి.

5. చీపుర్లు :

ఇంట్లో ఊడ్చే చీపురును ఎవరూ చూడని ప్రదేశంలో.. నేల మీద పడుకోబెట్టి ఉంచాలి. కానీ చాలా మంది పొరపాటున చీపురును ప్రధాన ద్వారం వెనుక లేదా గుమ్మం పక్కనే నిలబెడతారు. వాస్తు ప్రకారం.. ఇది చాలా దోషం. ఇది ఇంట్లోకి వచ్చే ఐశ్వర్యాన్ని అడ్డుకుంటుంది.

6. పనికిరాని వస్తువులు :

మెయిన్ డోర్ ఎదురుగా ఎప్పుడూ అస్తవ్యస్తంగా చెత్తాచెదారం ఉండకూడదు. ముఖ్యంగా ఇంటి గుమ్మం ఎదురుగా మురికి కాలువలు, కరెంట్ పోల్స్ లేదా చెట్ల వేర్లు ఉండటం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి త్వరగా ప్రవేశిస్తుంది. గుమ్మం ముందు స్థలం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలి.

Also Read: గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

7. చీకటి వాతావరణం:

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర ఒక చిన్న లైట్ కచ్చితంగా వెలిగించాలి. గుమ్మం దగ్గర వెలుతురు లేకపోతే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని, ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పైన పేర్కొన్న చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే.. వెంటనే సరిదిద్దుకోండి. సానుకూల శక్తిని ఆహ్వానించి మీ కుటుంబాన్ని కాపాడుకోండి.

 

Related News

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

Big Stories

Advertisement
×