Google Pixel 10 Price Cut: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి, ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి ఒక సూపర్ న్యూస్. ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయిన Google Pixel 10 ఇప్పుడు అమేజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. గతేడాది ఆగస్టులో రూ.79,999కి లాంచ్ అయిన ఈ ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. మంచి కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
Google Pixel 10లోని 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమేజాన్‌లో రూ.68,390కే లిస్ట్ అయి ఉంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే.. మరో 2.5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ దాదాపు రూ.66,680కి తగ్గుతుంది. అంటే.. లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.13,319 వరకు ఆదా చేసుకోవచ్చు.
Also Read: iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!
ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల అక్టువా OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 60Hz నుండి 120Hz వరకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఫోన్లు ఇష్టపడని వారికి ఈ కాంపాక్ట్ డిజైన్ బాగా నచ్చుతుంది.
గూగుల్ సొంత టెన్సార్ G5 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇక ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. దీనిలో వెనుక వైపు 3 కెమెరాలు ఉన్నాయి. 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. గూగుల్ AI ఫీచర్లతో ఫొటోలు చాలా అద్భుతంగా వస్తాయి.
Google Pixel 10 ఫోన్‌లో 4970mAh బ్యాటరీ ఉంది. ఇది రోజువారీ వాడకానికి సరిపోతుంది. అలాగే 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 5G, వైఫై 6E, బ్లూటూత్ 6 వంటి ఆల్ రౌండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంతకుముందు ధర ఎక్కువని ఆగిపోయిన వారు, ఇప్పుడు లభిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వదులుకోవద్దు. కొనేముందు అమేజాన్‌లో ఆఫర్ ధరను ఒకసారి సరిచూసుకోండి.
Also Read: 4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?