E-Paper
Advertisement

ఫ్రిజ్ పైన ఈ వస్తువులు పెట్టకూడదు.. ఇంట్లో వాస్తు దోషం, దరిద్రం వీటి వల్లే

ఫ్రిజ్ పైన ఈ వస్తువులు పెట్టకూడదు.. ఇంట్లో వాస్తు దోషం, దరిద్రం వీటి వల్లే
Advertisement

Vastu Tips Fridge| చాలా మంది ఇంట్లో ఫ్రిజ్ ఉంటే చాలు.. దాని పై ఉండే స్థలాన్ని ఖాళీగా చూసి వస్తువులు పెట్టేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఫ్రిజ్ పైన ఉంచడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ (సానుకూల శక్తి) దెబ్బతింటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి, సంపద స్థిరంగా ఉంటాయి.

దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఉంచకండి

చాలా మంది ఫ్రిజ్ పైన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు అందంగా ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది అశుభం. ఫ్రిజ్ నుంచి వచ్చే వేడి, విద్యుత్ శక్తి పూజా వస్తువులకు మంచిది కాదు. విగ్రహాలను పూజా గది లేదా ప్రత్యేక షెల్ఫ్‌లో ఉంచడమే ఉత్తమం.

ఔషధాలు ఫ్రిజ్ పైన పెట్టకూడదు

Advertisement

స్థలం అనుకూలంగా ఉంటుందని చాలా మంది మందులు ఫ్రిజ్ పైన ఉంచుతారు. కానీ ఫ్రిజ్ వేడి వల్ల మందుల నాణ్యత తగ్గి ఆరోగ్యానికి హాని కలగవచ్చు. వాస్తు ప్రకారం కూడా ఇది మంచిది కాదు. మందులను చల్లని క్యాబినెట్‌లో భద్రపరచాలి.

నీటి సంబంధిత వస్తువులు

ఫ్రిజ్ లోపలి వస్తువులను చల్లగా ఉంచినా అది బయటికి వేడి విసర్జిస్తుంది. అంటే ఫ్రిజ్ అగ్ని తత్వంతో ముడిపడి ఉంటుంది. దాని పైన నీటి సంబంధిత వస్తువులు (అక్వేరియం, నీళ్లు నిండిన పాత్రలు, నీటితో ఉన్న మనీ ప్లాంట్) ఉంచడం వల్ల ఇంట్లో శక్తి అసమతులం అవుతుందని వాస్తు చెబుతుంది. ఇది ఆర్థిక సమస్యలు, కుటుంబ వివాదాలకు దారితీయవచ్చు.

మొక్కలు ఫ్రిజ్ పైన పెట్టవద్దు

Advertisement

అందం కోసం చాలా మంది ఫ్రిజ్ పైన అలంకరణ మొక్కలు ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. ఫ్రిజ్ వేడి, కాంతి లోపం వల్ల మొక్కలు సరిగా పెరగవు. ముఖ్యంగా వెదురు లాంటి మొక్కలను ఫ్రిజ్ పైన ఉంచరాదు. మొక్కలను కిటికీల దగ్గర ఉంచండి.

బరువైన వస్తువులు ఉంచకండి

పెద్ద డబ్బాలు, బరువైన సామాన్లు ఫ్రిజ్ పైన ఉంచడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఫ్రిజ్ ఎప్పుడూ ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అంటే ఫ్రిజ్‌కు వెంటిలేషన్‌ చాలా అవసరం. ఫ్రిజ్ పైన లేదా చుట్టూ ఏవైనా భారీ లేదా బరువుగా ఉండే వస్తువులు పెడితే అక్కడ గాలి సరిగా రాదు. వాస్తు ప్రకారం వస్తువులు చిందరవందరగా పెడితే అవి ఇంట్లో సానుకూల శక్తికి అడ్డంకి.

ఎలక్ట్రానిక్ పరికరాలు దూరంగా ఉంచండి

ఛార్జర్లు, స్పీకర్లు, రౌటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్రిజ్ పైన ఉంచడం మంచిది కాదు. ఎక్కువ వేడి ఏర్పడి శక్తి స్థిరంగా ఉండదు. పాడైన లేదా ఉపయోగించని పరికరాలు ఇంట్లో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.

Also Read: రాత్రి పడుకునే ముందు ఈ పనులు అసలు చేయొద్దు.. ఇంట్లో దరిద్రం, కష్టాలు వీటి వల్లే

డబ్బు, విలువైన వస్తువులు ఉంచవద్దు

డబ్బు, నగలు, ట్రోఫీలు ఫ్రిజ్ పైన ఉంచడం వాస్తు ప్రకారం అశుభం. విలువైన వస్తువులను సురక్షితమైన చోట భద్రపరచాలి.

ఫ్రిజ్ సరైన దిక్కులో ఉంచండి

ఫ్రిజ్‌ను పశ్చిమ దిక్కుగా ఉంచడం మంచిది. గోడల నుంచి కొంత దూరంలో ఉంచి వెంటిలేషన్ ఉండేలా చూడాలి. ఫ్రిజ్ ఉండే ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, సరద్దుగా ఉంచాలి.

కిచెన్ శుభ్రంగా, సర్దుగా ఉంచడం ఎందుకు ముఖ్యం

ఇంట్లో వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

Related News

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

కడుపు బరువుగా అనిపిస్తుందా? భోజనం తర్వాత పైనాపిల్ తింటే చాలా ప్రయోజనాలు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ వ్యాయామం చేస్తే మంచి గాఢనిద్ర మీ సొంతం

Zomatoలో ఈ టేస్టీ ఫుడ్స్ ఇక దొరకవ్..ఎందుకంటే ?

Big Stories

Advertisement
×