E-Paper
Advertisement

17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం

17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం
Advertisement

SIR update: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడో దశ ఓటర్ల సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. సుమారు 40 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తూ 17 రాష్ట్రాలు.. ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ భారీ వడపోత ప్రక్రియను చేపట్టనున్నట్లు ఈసీ అధికారులు సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియడంతో నిలిచిపోయిన ఈ సవరణ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పట్టాలెక్కిస్తున్నారు.

దేశంలో మొత్తం 99 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు వివిధ దశల్లో నిర్వహించిన ప్రక్షాళన ద్వారా 60 కోట్ల మంది ఓటర్ల జాబితా ఫిల్టర్ అయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్.. పశ్చిమ బెంగాల్.. తమిళనాడు.. రాజస్థాన్.. కేరళ వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. అస్సాంలో మాత్రం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిగిలిన 40 కోట్ల మంది ఓటర్ల డేటాను సరిచూసే బాధ్యతను మూడో దశలో భాగంగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల జాబితాలో దొర్లిన తప్పులు.. మరణించిన వారి పేర్లు.. డూప్లికేట్ ఓట్ల తొలగింపు సులభతరం కానుంది.

Advertisement

వాస్తవానికి ఈ సవరణ ప్రక్రియ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై ఫిబ్రవరి 19నే రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అయితే రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ షెడ్యూల్‌లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బిహార్‌లోని ఓటర్ల సవరణపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడం.. పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు.. ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగియడంతో అధికారులు మూడో దశపై దృష్టి సారించారు.

రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఈ వడపోత కార్యక్రమం ద్వారా ఓటర్ల చిరునామాలు.. ఫోటోల మార్పులు.. కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను పరిశీలిస్తారు. బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ డేటాలో ఉన్న లోపాలను సరిదిద్ది.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ SIR ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయ పార్టీల విమర్శలకు తావు లేకుండా అత్యంత పారదర్శక సాంకేతికతను ఈ ప్రక్రియలో వినియోగించనున్నారు.

Advertisement

Read Also: భారత్‌లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×