E-Paper
Advertisement

Veg vs Non-Veg: వెజ్ Vs నాన్ వెజ్.. ఫిట్‌నెస్ కోసం ఏది బెస్ట్ ?

Veg vs Non-Veg: వెజ్ Vs నాన్ వెజ్.. ఫిట్‌నెస్ కోసం ఏది బెస్ట్ ?
Advertisement

Veg vs Non-Veg: ఫిట్‌నెస్ ప్రపంచంలో ఎప్పటికీ తెగని చర్చ ఏదైనా ఉందంటే అది ‘వెజిటేరియన్ vs నాన్-వెజిటేరియన్’ డైట్. కండరాల పుష్టి కోసం మాంసాహారం తప్పనిసరి అని కొందరంటే, వెజ్ ఫుడ్ తోనే అత్యుత్తమ ఆరోగ్యం, వేగం సాధ్యమని మరికొందరి వాదన. వాస్తవానికి.. ఫిట్‌నెస్ అనేది కేవలం మీరు తినే ఆహారం రకం మీద మాత్రమే కాకుండా.. అందులో ఉండే పోషకాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.

1. ప్రోటీన్ లభ్యత:
కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం.

Advertisement

నాన్-వెజ్: చికెన్, చేపలు, గుడ్లలో ‘కంప్లీట్ ప్రోటీన్’ ఉంటుంది. అంటే శరీరానికి కావలసిన అన్ని ఎమినో యాసిడ్స్ ఇందులో సులభంగా దొరుకుతాయి.

వెజ్: పప్పుధాన్యాలు, పనీర్, సోయా, చిక్కుళ్ళలో ప్రోటీన్ ఉంటుంది. అయితే.. చాలా శాఖాహారాల్లో కొన్ని ఎమినో యాసిడ్స్ తక్కువగా ఉండవచ్చు. అందుకే శాఖాహారులు వేర్వేరు రకాల పప్పులను కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

2. జీర్ణక్రియ, శక్తి:

వెజ్: శాఖాహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే అథ్లెట్లు తాము మరింత ఉత్సాహంగా.. తేలికగా ఉన్నట్లు ఫీలవుతారు.

నాన్-వెజ్: మాంసాహారం జీర్ణం కావడానికి మెదడు, శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇందులో ఉండే ‘హీమ్ ఐరన్’ , విటమిన్ B12 రక్తహీనతను నివారిస్తాయి.

3. కొవ్వు, కేలరీలు:
నాన్-వెజ్: మాంసం వంటి వాటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అయితే.. లీన్ మీట్ (చికెన్ బ్రెస్ట్) ఫిట్‌నెస్‌కు చాలా మేలు చేస్తుంది.

వెజ్: శాఖాహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా అనుకూలమైనది. కానీ.. ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి.

Also Read: ఖరీదైన క్రీములు అవసరమే లేదు ? స్కిన్ కేర్ రొటీన్‌కు ఇవే బెస్ట్

4. రికవరీ, వాపు :
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. పండ్లు , కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాయామం తర్వాత కండరాల వాపును త్వరగా తగ్గిస్తాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది బాడీబిల్డర్లు కూడా ‘వీగన్’ లేదా ‘వెజిటేరియన్’ డైట్ వైపు మొగ్గు చూపుతున్నారు.

5. విటమిన్లు , ఖనిజాలు:
నాన్ వెజ్ తినే వారు విటమిన్ B12, జింక్ సులభంగా అందుతాయి. శాఖాహారులు వీటి కోసం పాలు, పెరుగు లేదా సప్లిమెంట్లపై ఆధారపడాల్సి రావచ్చు. మరోవైపు.. శాఖాహారులకు విటమిన్ C , ఫోలేట్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

ఏ డైట్ బెస్ట్ అనేది అనేది మీ వ్యక్తిగత లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు కండరాలను త్వరగా పెంచాలనుకుంటే , మాంసాహారం సులభమైన మార్గం. కానీ, ఓర్పు, దీర్ఘకాలిక ఆరోగ్యం , గుండె ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే శాఖాహారం గొప్పది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×