E-Paper
Advertisement

US-Israel Vs Iran War: అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి, ఇరాన్ మీడియా క్లారిటీ

US-Israel Vs Iran War: అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి, ఇరాన్ మీడియా క్లారిటీ
Advertisement

US-Israel Vs Iran War: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య వార్ తారాస్థాయికి చేరింది. కచ్చితమైన టార్గెట్‌లను నిర్దేశించి మరీ దాడులు చేస్తున్నాయి అమెరికా-ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ కీలక నేతలు మృతి చెందిన అమెరికా-ఇజ్రాయెల్ ప్రకటించాయి. ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ పాలకులు తోసిపుచ్చారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులు

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన ట్రూత్‌లో పోస్ట్‌లో ఓ ప్రకటన చేశారు. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో వ్యక్తుల్లో ఇరాక్ సుప్రీం ఖమేనీ మరణించాడని రాసుకొచ్చాడు. నిఘా వ్యవస్థ నుంచి ఆయన తప్పించు కోలేకపోయాడని రాసుకొచ్చారు. ఇరాన్‌పై నిరంతరాయంగా బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు.

ఈ దాడులు వారం లేకుంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చన్నవారు. ఇరానియన్లు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదొక అవకాశమన్నారు. ఈ విషయంలో అతనితో పాటు మృతి చెందిన ఇతర నాయకులు ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. IRGC మిలిటరీ, ఇతర భద్రతా దళాలు తమపై పోరాటం చేయడానికి ఇష్టపడ లేదన్నారు.

Advertisement

 ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందినట్టు ట్రంప్ ప్రకటన.. తోసిపుచ్చిన ఇరాన్

IRGC, పోలీసులు ఇరానియన్ పేట్రియాట్స్‌తో శాంతియుతంగా విలీనం అవుతారని రాసుకొచ్చారు. దేశాన్ని తిరిగి గొప్పగా తీసుకురావడానికి ఒక యూనిట్‌గా కలిసి పని చేస్తాయని అందులో ప్రస్తావించారు. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కావాలని పేర్కొన్నారు. అటు వైమానిక దాడుల్లో ఇరాన్‌ సుప్రీం ఖమేనీ నివాసం నేల మట్టమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆయన జీవించి ఉండకపోవచ్చని తెలిపారు. ఖమేనీ నివాసంపై శనివారం 30 బాంబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ అధినేతలు చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది.   ఇరాన్ మీడియా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.  అమెరికా-ఇజ్రాయెల్ దాడులలో అయతుల్లా ఖమేనీ, ఆయన కూతురు, అల్లుడు, మనవడు మరణించినట్లు పేర్కొంది.

ALSO READ:  టార్గెట్ బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనమే ఇరాన్ టార్గెట్? ఎందుకంటే

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×