E-Paper
Advertisement

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!
Advertisement

Ganesh Chaturthi 2026 significance: మనదేశంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగలలో వినాయక చవితి ఒకటి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పుట్టిన రోజుగా భావించే ఈ పండగను ప్రతి ఇంటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే ఈ పండగకు హిందూ సంస్కృతిలో అత్యంత విశిష్ట స్థానం ఉంది. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజున వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14, సోమవారం రోజున వినాయక చవితి పండగను జరుపుకోనున్నారు. వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా, జ్ఞానానికి, అదృష్టానికి , బుద్ధికి దేవుడిగా భావిస్తారు. ఏ శుభకార్యమైనా, కొత్త పనైనా ప్రారంభించే ముందు గణపతిని స్మరించుకోవడం మన సనాతన సంప్రదాయం.

పౌరాణిక ప్రాముఖ్యత , విశేషాలు:

శివపార్వతుల పుత్రుడైన శ్రీ గణేశుడు జన్మించిన పర్వదినమే వినాయక చవితిగా ప్రసిద్ధి చెందింది. ఈ పది రోజుల పాటు సాగే గణేశోత్సవాలు కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, ప్రజలందరినీ ఐకమత్యంగా ఉంచే గొప్ప సాంస్కృతిక వేడుక.

Advertisement

విఘ్నహర్త: జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, అడ్డంకులనైనా తొలగించి విజయాన్ని ప్రసాదించే దేవుడిగా స్వామిని కొలుస్తారు.

పర్యావరణ హితం: నేటి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే అవగాహన విపరీతంగా పెరుగుతోంది.

Advertisement

Also Read: గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

పూజా ముహూర్తం:

సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్న సమయం వినాయక ప్రతిమల ప్రతిష్టాపనకు అత్యంత శుభప్రదమైందిగా పండితులు చెబుతున్నారు. ఇళ్లలో , కాలనీలలో భక్తిశ్రద్ధలతో గణపతి మంటపాలను ఏర్పాటు చేసి రకరకాల పూలతో అలంకరిస్తారు. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్లు వంటి ప్రత్యేక పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ఉపవాసాలు ఉండి, స్వామివారి వ్రత కథను పఠించి పూజలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న లంబోదరుడు, అనంత చతుర్దశి నాడు నిమజ్జనం అవుతాడు.

సకల జనుల పూజలందుకునే వినాయక చవితి పండగ మనలో సరికొత్త ఉత్సాహాన్ని, సానుకూల శక్తిని నింపుతుంది. ఈ వినాయక చవితి అందరి జీవితంలో అష్టైశ్వర్యాలను, సంతోషాలను, విజయాలను తెచ్చిపెట్టాలని కోరుకుందాం

Related News

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

Big Stories

Advertisement
×