Auto Ramprasad: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం మరికొన్ని గంటలలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా సోషల్ మీడియా వేదికగా తమని సపోర్ట్ చేయమని కోరుతూ పోస్టులు చేస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో బుల్లితెర సీరియల్ నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జబర్దస్త్ కమెడియన్స్ కూడా కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి ఆటో రాంప్రసాద్ అలాగే పొట్టి నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అనంతరం ఆటో రాంప్రసాద్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..
“జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా” అంటూ ఆటో రామ్ ప్రసాద్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ విధంగా పోస్ట్ చేయడంలో బిగ్ బాస్ ద్వారా కొత్త ప్రయాణం మొదలు కాబోతుందని ఈ బిగ్ బాస్ జర్నీలో కూడా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అంటూ ఈయన పరోక్షంగా తన అభిమానులకు తెలియజేశారు.
#Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU ❤️🙏
Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!
Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ
— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్న ఆటో రామ్ ప్రసాద్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఆటోరామ్ ప్రసాద్ తన ఆటతీరుతో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సిందే. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మా లో ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో సెలబ్రిటీలతోపాటు కామనర్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆరుగురు అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక అవుతూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.
Also Read: నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!