E-Paper
Advertisement

వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే.. గుండె జబ్బులు దరిచేరవు!

వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే.. గుండె జబ్బులు దరిచేరవు!
Advertisement

Health Tips: ఈ టెక్నాలజీ యుగంలో మనుషులు ఎంత బిజీ అయిపోయారంటే.. వాళ్లకి తెలియకుండానే అనేక రోగాలను తమ శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోవడం. అది పని ఒత్తిడి వల్ల కావచ్చు.. మరే కారణం వల్ల అయినా కావచ్చు.. కదలకుండా అలా కుర్చీకే అతుక్కుపోవడం వల్ల మన గుండెతో పాటు మెదడు పనితీరు కూడా మందగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తు ఆరోగ్యానికి ఒక పెద్ద ఇన్సూరెన్స్ లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు.

కదలిక లేకపోవడమే ముప్పు..

చాలామంది వ్యాయామం అంటే కేవలం జిమ్‌కి వెళ్లడమో లేదంటే ఒళ్లు హూనమయ్యేలా కష్టపడటమో అనుకుంటారు. కానీ అసలు సమస్య మనం రోజంతా ఎంత సమయం కదలకుండా కూర్చుంటున్నాం అనే దాని దగ్గరే మొదలవుతుంది. పొద్దున్నే ఒక అరగంట వ్యాయామం చేసినా.. మిగిలిన రోజంతా కుర్చీలో కూర్చునే ఉంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదట. ఇలా ఉండటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. అందుకే పని మధ్యలో తరచూ బ్రేక్ తీసుకుంటూ, కాసేపు అటు ఇటు నడవటం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

Advertisement

Also Read: ఆరెంజ్ vs గ్రీన్.. ఈ రెండు రకాల కొబ్బరి బొండాల్లో ఏది తాగితే ఎక్కువ బలం?

వాకింగ్ ఎందుకంత ప్రత్యేకం?

ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు, పెద్ద పెద్ద పరికరాలు అవసరం లేదు. అప్పుడప్పుడూ కాసేపు వాకింగ్ చేస్తే చాలు. ఇది కేవలం శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా.. మనసులోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. వారానికి కనీసం ఒక 150 నిమిషాల పాటు నడిస్తే చాలు, గుండె పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది. ఈ 150 నిమిషాలను వీలును బట్టి రోజువారీ నడకలాగా గానీ లేదా వారాంతాల్లో కాస్త ఎక్కువ సమయం కేటాయించి గానీ పూర్తి చేయొచ్చు. ఒకేసారి నడవలేకపోయినా.. అప్పుడప్పుడు కొద్ది నిమిషాల పాటు నడిచినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.

నడకను అలవాటుగా మార్చుకుంటే..

Advertisement

మంచి అలవాట్లను మొదలుపెట్టడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. ఆఫీసులో మీటింగ్స్‌లో ఉన్నప్పుడు వీలైతే నడుస్తూ మాట్లాడటం లేదా లిఫ్ట్‌ను వాడకుండా మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే.. అటు అనుబంధం పెరుగుతుంది ఇటు ఆరోగ్యం దొరుకుతుంది. ఒకవేళ బయటకు వెళ్లడం కుదరకపోతే కూర్చున్న చోటే చిన్నపాటి స్ట్రెచింగ్ చేసినా మేలే. మనం తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలే మనల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కాపాడతాయి.

Also Read: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

Tags

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×