E-Paper
Advertisement

Medical Tests: 25 ఏళ్లు నిండాయా? అయితే ఈ ఆరోగ్య పరీక్షలు మీకోసం తప్పనిసరి!

Medical Tests: 25 ఏళ్లు నిండాయా? అయితే ఈ ఆరోగ్య పరీక్షలు మీకోసం తప్పనిసరి!
Advertisement

Medical Tests: నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి , శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్ల తర్వాత వచ్చే బీపీ, షుగర్ వంటి సమస్యలు ఇప్పుడు 25 ఏళ్ల యువతలో కూడా కనిపిస్తున్నాయి. అందుకే పాతికేళ్ల వయసు రాగానే మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా ముందుస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.

25 ఏళ్లు దాటిన వారు చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు:

Advertisement

ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవడం వేరు. వైద్యపరంగా నిర్ధారించుకోవడం వేరు. పాతికేళ్ల వయసులో చేయించుకోవాల్సిన ముఖ్యమైన టెస్టులు ఇవే..

1. రక్తపోటు పరీక్ష:
దీనినే బీపీ పరీక్ష అంటారు. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో యువతలో హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) పెరిగిపోతోంది. దీని వల్ల గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి కనీసం రెండుసార్లు బీపీ చెక్ చేయించుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Advertisement

2. రక్తంలో చక్కెర స్థాయిలు:
మన దేశం మధుమేహానికి రాజధానిగా మారుతోంది. వంశపారంపర్యంగా కాకుండా.. జీవనశైలి కారణంగా కూడా ప్రీ-డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఫాస్టింగ్ మరియు పోస్ట్ లంచ్ షుగర్ టెస్టులు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని ముందే గుర్తించవచ్చు.

3. లిపిడ్ ప్రొఫైల్:
జంక్ ఫుడ్, నూనె పదార్థాల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది రక్త నాళాలలో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. 25 ఏళ్ల వయసులో ఒకసారి కొలెస్ట్రాల్ లెవల్స్ చూసుకోవడం వల్ల భవిష్యత్తులో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

4. విటమిన్ డి, బి12 (Vitamin D & B12):
ప్రస్తుతం చాలామంది ఇళ్లలోనే లేదా ఏసీ గదుల్లో పని చేయడం వల్ల సూర్యరశ్మి తగలక విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అలాగే బి12 లోపం వల్ల నరాల బలహీనత, అలసట వస్తాయి. ఈ పరీక్షలు మీ ఎముకల, నరాల పుష్టికి చాలా అవసరం.

5. థైరాయిడ్ పరీక్ష (Thyroid Profile):

ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. బరువు పెరగడం, జుట్టు రాలడం, అలసట వంటి లక్షణాలు ఉంటే.. T3, T4, TSH పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత శరీర మెటబాలిజానికి చాలా కీలకం.

6. కంటి, దంత పరీక్షలు (Eye & Dental Checkups):
మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాగే చిగుళ్ల ఆరోగ్యం గుండె ఆరోగ్యంతో ముడిపడి
ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఏటా ఒకసారి వీటిని కూడా చెక్ చేయించుకోవాలి.

7. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP):
రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే త్వరగా అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి కూడా ఈ పరీక్ష పనికొస్తుంది.

Also Read: చర్మం నల్లబడటం, దద్దుర్లు వస్తున్నాయా? అది డయాబెటిస్ కావొచ్చు!

ఎందుకు ఈ వయసులోనే ?
పాతికేళ్లు అనేది శారీరకంగా.. మానసిక మార్పులకు గురయ్యే వయసు. ఈ వయసులో పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే లాభాలు.

ముందస్తు గుర్తింపు: వ్యాధి తీవ్రత పెరగకముందే చికిత్స ప్రారంభించవచ్చు.

లైఫ్ స్టైల్ మార్పులు: పరీక్ష ఫలితాలను బట్టి మీ డైట్, వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

ఆర్థిక ఆదా: పెద్ద వ్యాధులు వచ్చాక ఖర్చు చేసే దానికంటే.. ముందు జాగ్రత్త పరీక్షలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.

Tags

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×