E-Paper
Advertisement

Comedy Movie OTT : తమ్ముడి పెళ్లిలో అన్న గోల… కామిడీతో కేక పెట్టిస్తున్న ఖతర్నాక్ మూవీ

Comedy Movie OTT : తమ్ముడి పెళ్లిలో అన్న గోల… కామిడీతో కేక పెట్టిస్తున్న ఖతర్నాక్ మూవీ
Advertisement

Comedy Movie OTT : వెడ్డింగ్ కామెడీతో ఒక ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాకపోతే ఇది మరాఠీ సినిమా. చిన్న చిన్న మనస్పర్థలు, కోపతాపాలు ఉన్నప్పటికీ, కష్టం వచ్చినప్పుడు కుటుంబం అంతా ఒక్కటే అని ఈ సినిమా చూపిస్తుంది.  ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. సరదాగా సాగిపోయే ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడచ్చు అంటే 

2025లో వచ్చిన ఈ మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ఫస్‌క్లాస్ దభాడే’ (Fussclass Dabhade). ఇది హేమంత్ ధోమ్ దర్శకత్వంలో వచ్చింది. దీనిని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ మరియు క్షితీ జోగ్ నిర్మించారు. ఇందులో అమీ వాఘ్, సిద్ధార్థ్ చందేకర్, క్షితీ జోగ్, నివేదిత సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 24న రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రస్తుతం ZEE5లో అందుబాటులో ఉంది. Airtel Xstream, Apple TV లలో కూడా దీనిని స్ట్రీమ్ చెయ్యచ్చు. ఆయితే ఈ సినిమా ప్రస్తుతం మరాఠీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

దబాడే కుటుంబంలో చిన్నవాడైన ప్రశాంత్ పెళ్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పెళ్లి అనగానే ఊళ్లో ఉన్న బంధువులందరూ ఒకచోట చేరుతారు కదా, అలాగే ప్రశాంత్ అన్నయ్య కిరణ్, అక్క జయశ్రీ కూడా వస్తారు. అయితే బయటికి అంతా బాగున్నట్టు కనిపించినా, లోపల మాత్రం ఎవరి బాధలు వాళ్లకి ఉంటాయి. కిరణ్ తన ప్రేమ ఫైల్ కావడానికి తండ్రే కారణమని కోపంతో ఉంటే, జయశ్రీ పిల్లలు కలగలేదన్న బాధలో, సమాజం మాట్లాడే సూటి పోటీ మాటలతో విసిగిపోయి ఉంటుంది. ఇక ఈ పెళ్లి సందడి మధ్యలో ఈ పాత గొడవలు, మనస్పర్థలు బయటపడి కుటుంబంలో గందరగోళం మొదలవుతుంది.

ఇక పెళ్లి తర్వాత జరిగే అసలు డ్రామాలో, ఈ తోబుట్టువులు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కిరణ్ తన మాజీ ప్రేమికురాలిని కలిసినప్పుడు, ఆమె ఇచ్చే సలహాతో తన గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు. జయశ్రీ కూడా తన సమస్యల నుండి బయటపడి ప్రశాంతతను పొందుతుంది. మొత్తానికి నవ్వులు, కన్నీళ్లు, గొడవలతో సాగే ఒక రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామా ఇది.

Advertisement

Read Also : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×