E-Paper
Advertisement

Jogging For Weight Loss: జాగింగ్‌తో ఈజీగా వెయిట్ లాస్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు

Jogging For Weight Loss: జాగింగ్‌తో ఈజీగా వెయిట్ లాస్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు
Advertisement

Jogging For Weight Loss: జాగింగ్ అనేది తక్కువ వేగంతో, నిదానంగా పరిగెత్తే వ్యాయామం. ఇది మీ కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అంతే కాకుండా బరువు తగ్గడానికి అత్యంత ప్రభావ వంతమైన మార్గాలలో ఒకటి. క్రమం తప్పకుండా జాగింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు, మీ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జాగింగ్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

Advertisement

1. కేలరీలు:
జాగింగ్ అనేది అధిక తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం. ఇది వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి కేలరీలు తగ్గడం చాలా ముఖ్యం. జాగింగ్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుంది.

2. పెరిగిన జీవక్రియ రేటు :
జాగింగ్ చేయడం వల్ల వ్యాయామం తర్వాత కూడా మీ శరీర జీవక్రియ రేటు పెరిగి, ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. దీనిని ఎపిఓసి అని అంటారు.

Advertisement

3. కండరాల బలోపేతం:
జాగింగ్ మీ కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది. కండర ద్రవ్యరాశి పెరిగే కొద్దీ.. విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలు దహనం అవుతాయి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

4. విసెరల్ ఫ్యాట్ తగ్గింపు:
జాగింగ్ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన అత్యంత ప్రమాదకరమైన విసెరల్ ఫ్యాట్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. ఆకలి నియంత్రణ:
క్రమం తప్పకుండా జాగింగ్ చేయడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లవిడుదలలో మార్పులు వస్తాయి. దీని వల్ల అతిగా తినడం తగ్గుతుంది.

6. మెరుగైన గుండె ఆరోగ్యం :
జాగింగ్ మీ గుండెకు మంచి వ్యాయామాన్ని అందించి, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇది రక్తపోటును తగ్గించి, హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

7. మానసిక ఉల్లాసం:
జాగింగ్ చేసేటప్పుడు శరీరం ఎండార్ఫిన్స్‌తో పాటు మూడ్ లిఫ్టర్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆందోళన , డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.

8. మెరుగైన నిద్ర:
జాగింగ్ డైలీ చేయడం వల్ల మీ నిద్ర నాణ్యతను గణనీయంగా మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా మంచి నిద్ర హార్మోన్ల సమతుల్యతకు, ముఖ్యంగా బరువును ప్రభావితం చేసే ఆకలి హార్మోన్ల (ఘ్రెలిన్, లెప్టిన్) సమతుల్యతకు ఇది చాలా కీలకం.

Also Read: ఉద్యోగం కంటే స్వేచ్ఛ ముఖ్యమా ? కార్పొరేట్ లైఫ్‌ను వదిలేసి, సంతోషాన్ని వెతుక్కుంటున్న యువత

9. ఎముకల సాంద్రత పెరుగుదల:
జాగింగ్ అనేది భారం మోసే వ్యాయామ. ఇది మీ ఎముకలపై ఒత్తిడిని కలిగించి, వాటి సాంద్రతను పెంచుతుంది. అంతే కాకుండాఇది ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.

10. పెరిగిన శక్తి స్థాయిలు:
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ , పోషకాల సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల రోజంతా చురుకుగా ఉండటానికి, అంతే కాకుండా పనులను పూర్తి చేయడానికి అవసరమైన శక్తి పెరుగుతుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×