Bigg Boss 9 Telugu : టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు 9 సండే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఎవరు బయటకు వెళ్లబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉరకలేసింది.. కానీ ఇమ్మూ వల్ల నో ఎలిమినేషన్ అయ్యింది. ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున తెలిపారు. దాంతో డేంజర్ జోన్లో ఉన్న సంజన, దివ్య ఊపిరిపీల్చుకున్నారు.. మొత్తానికి వీళ్లిద్దరు సేఫ్ అయ్యినట్లు బిగ్ బాస్ ప్రకటించేసాడు. 11వ వారం నో ఎలిమినేషన్ ఉండడంతో 12 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్ జరిగాయి. అయితే ఎప్పటిలాగా గొడవలకి కేరాఫ్ గా మారకుండా సీక్రెట్ గా నామినేషన్స్ జరగడం విశేషం. మరి ఎవరు, ఎవరిని నామినేట్ చేశారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
సీరియల్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర నటి తనూజ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు.. సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో చాకచక్యంగా టాస్కులలో పెర్ఫార్మన్స్ చేస్తూ ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవుతూ వస్తుంది.. అయితే గతవారం నామినేషన్స్ లోకి తనుజ వచ్చింది.. కాగా 12వ వారం కూడా నామినేషన్స్ లో తనుజ పేరు వచ్చింది.. ఆమెను నామినేట్ చేసింది ఎవరో కాదు హౌస్ లో నాన్న అని ప్రేమగా పిలుస్తున్న భరణి. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా సరిగ్గా మాటలు లేవన్న సంగతి తెలిసిందే. నిన్న ఫ్యామిలీ వీక్ లో సందర్భంగా భరణి వాళ్ళ అమ్మ తనూజ పై ప్రశంసలు కురిపించింది. అయినా కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగలేదని తెలుస్తుంది.. ఇక దాంతోనే భరణి ఆమెను నామినేట్ చేశాడు.. ఇది నిజంగానే తనుజాకు బిగ్ షాక్..
తాజాగా 12వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రోమో ని బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో ముందుగా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది అని అంటాడు. ఎప్పటిలాగా కాకుండా ఈవారం సీక్రెట్ గా నామినేట్ చేయాలి అని చెబుతాడు.. ఎవరిని నామినేట్ చేస్తున్నారో వారి గురించి మీరు చెప్పలేని సీక్రెట్ ని చెప్తూ నామినేట్ చేయాలి అని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఆదేశిస్తాడు.. ముందుగా ఇమ్మానూయేల్ డిమాన్ పవన్ నూ నామినేట్ చేస్తాడు.. ఆ తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేస్తాడు.. ఆయన ఈ మధ్య కెప్టెన్సీ పై ఫోకస్ చేస్తున్నాడు అని అంటాడు.. ఆ తర్వాత భరణి తనుజను నామినేట్ చేస్తాడు.. దివ్య తనుజ ఇద్దరూ చిన్నపిల్లల లాగా బిహేవ్ చేస్తున్నారు ఎంత చెప్పినా కూడా వీళ్లు వినడం లేదు ఇంకేమీ చేయలేము అని నామినేట్ చేస్తాడు.. కళ్యాణ్ ను నామినేట్ చేస్తాడు పవన్.. ఇక దివ్య భరణిని నామినేట్ చేస్తుంది. తనుజ కూడా భరణిని నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. తనుజ కూడా భరణిని నామినేట్ చేసినట్లు ఉంది. మరి సంజన ఎవరిని నామినేట్ చేసిందన్నది మరో ప్రోమోలో తెలిసే అవకాశం ఉంది..
Also Read : బిగ్ బాస్ కు రికార్డు బ్రేక్ రేటింగ్.. నాలుగు సీజన్ల తర్వాత హైయెస్ట్ వీకెండ్ రేటింగ్..
బిగ్ బాస్ సీజన్ 9 12వ వారం కూడా దివ్య సంజన ఇద్దరు డేంజర్ జోన్ లోనే ఉన్నారు.. వీరిద్దరిలో ఈవారం సంజన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే దివ్య వల్ల ఈమధ్య గొడవలు జరుగుతున్నాయి.. దాంతో రేటింగ్ కూడా బాగా పెరగడంతో బిగ్ బాస్ ఆమెను ఇప్పట్లో బయటికి పంపించేలా కనిపించట్లేదు. నిన్న ఎలిమినేషన్ లేదు అని ఆమెను సేవ్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంజన బయటకు వెళ్తుందా..? లేక మరొకరు బయటకు వెళ్తారా చూడాలి..