E-Paper
Advertisement

Bus Catche Fire: మంటల్లో లగ్జరీ బస్సు.. ఆటో డ్రైవర్ హెచ్చరిక, ప్రయాణికులు పరుగో పరుగు

Bus Catche Fire: మంటల్లో లగ్జరీ బస్సు..  ఆటో డ్రైవర్ హెచ్చరిక,  ప్రయాణికులు పరుగో పరుగు
Advertisement

Bus Catche Fire: పుదుచ్చేరి ప్రాంతంలో లగ్జరీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ మంటలను గమనించి బస్సు డ్రైవర్‌ని అప్రమత్తం చేశాడు. ఈ ఘటనలో బస్సు మంటల్లో చిక్కుకుంది. 13 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?

Advertisement

మంటల్లో చిక్కుకున్న లగ్జరీ బస్సు

పుదుచ్చేరి నుంచి కడలూరు మీదుగా పొల్లాచ్చికి సోమవారం రాత్రి 10 గంటలకు ఓ లగ్జరీ బస్సు బయలుదేరింది. బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు నురాడి రోడ్ ఫ్లైఓవర్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ పొగ రావడం గమనించాడు.

Advertisement

వెంటనే బస్సుని ఓవర్ టేక్ చేసి ఆటోను అడ్డంగా ఆపాడు. అసలు విషయాన్ని డ్రైవర్‌కి చెప్పాడు. ఈలోగా బస్సు డ్రైవర్ వంతెన పక్కన బస్సుని ఆపాడు. ప్రయాణికులను దించేశాడు. ఆ సమయంలో ప్రయానికులు అరుపులు, కేకలు వేస్తూ బస్సు నుంచి కిందకు దిగేశారు. ఈలోగా మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.

పుదుచ్చేరిలో ఘటన.. ఆటో‌డ్రైవర్ సమాచారంతో

ఘటన కారణంగా కొంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తమ వస్తువులను బస్సులో వదిలేశారు. రోడ్డుపై బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే బస్సు మొత్తం కాలిపోయింది. దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా పుదుచ్చేరి-నూరడి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆ రూట్లో వెళ్లే వాహనాలను వేరే మార్గంలో దారి మళ్లించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఘటన ఎలా జరిగింది? అనేదానిపై డ్రైవర్, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. 

ALSO READ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక!

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×