E-Paper
Advertisement

Papaya Leaf Water: వారానికి 3 సార్లు బొప్పాయి ఆకుల నీరు తాగితే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

Papaya Leaf Water: వారానికి 3 సార్లు బొప్పాయి ఆకుల నీరు తాగితే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Advertisement

Papaya Leaf Water: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే..ని నుంచి తయారుచేసే ‘బొప్పాయి ఆకుల నీరు’ లో అంతకంటే శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. వారానికి మూడుసార్లు ఈ నీటిని తాగడం వల్ల మీ శరీరంలో కలిగే మార్పులు, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Advertisement

1. ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుద:

బొప్పాయి ఆకుల నీటి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడం. ముఖ్యంగా డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయి. వారానికి మూ డుసార్లు ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతే కాకుండా రక్తం గడ్డకట్టే సామర్థ్యం మెరుగుపడుతుంది.

Advertisement

2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

బొప్పాయి ఆకుల్లో పాపైన్, కైమోపాపైన్ అనే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ నీరు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది.

3. రోగనిరోధక శక్తి పెరుగుదల:

ఇందులో ఉండే విటమిన్-సి, విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని తెల్ల రక్తకణాలను ఉత్తేజితం చేస్తాయి. వారానికి మూడుసార్లు ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ జ్వరాలు, జలుబు వంటివి త్వరగా దరిచేరవు.

4. లివర్ క్లెన్సింగ్ :

బొప్పాయి ఆకుల నీరు కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

5. చర్మ, జుట్టు ఆరోగ్యం:

ఈ నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు పడకుండా కాపాడతాయి. మొటిమలు, మచ్చలు తగ్గడానికి. జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇది సహాయ పడుతుంది. లోపలి నుంచి రక్తం శుద్ధి అవ్వడం వల్ల చర్మం సహజమైన కాంతితో మెరుస్తుంది.

Also Read: చలికాలంలో డ్రై స్కిన్ సమస్యకు.. వీటితో చెక్ !

జాగ్రత్తలు:

మితిమీరి తాగకూడదు: దీని రుచి చాలా చేదుగా ఉంటుంది. అతిగా తాగితే వికారం లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంది.

గర్భిణీలు: గర్భిణీ స్త్రీలు బొప్పాయి ఆకుల నీటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తారు.

వైద్యుల సలహా:

మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే లేదా మందులు వాడుతుంటే.. ఈ నీటిని మీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టరును సంప్రదించడం ఉత్తమం.

వారానికి మూడుసార్లు ఒక చిన్న గ్లాసు బొప్పాయి ఆకుల నీరు తాగడం వల్ల శరీరం లోపలి నుంచి శుభ్రపడి, రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×