E-Paper
Advertisement

Bigg Boss 9 Buzz: కళ్యాణ్‌ విజయం వెనకుంది దివ్యా?.. మరి తనూజ ఏంటీ బాబూ!

Bigg Boss 9 Buzz: కళ్యాణ్‌ విజయం వెనకుంది దివ్యా?.. మరి తనూజ ఏంటీ బాబూ!
Advertisement

Bigg Boss Buzz Kalyan Interview: కళ్యాణ్‌ పడాల.. టైటిల్‌ గెలిచి బిగ్‌బాస్‌లో కొత్త చరిత్రకు నాంది పలికాడు. కామనర్‌గా వచ్చి బుల్లితెరపై సంచలనంగా మారాడు. ప్రస్తుతం కళ్యాణ్ పడాల పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగుతుంది. జై జవాన్‌ అంటూ కళ్యాణ్‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇది అసాధారణమైన గెలుపని, ఓ కామనర్‌ తలుచుకుంటే ఏదైనా చేయగలడని కళ్యాణ్‌ చేసి చూపించడంటూ అతడిని కొనియాడుతున్నారు.

బజ్ లో కళ్యాణ్ సందడి

Advertisement

ఆదివారం (డిసెంబర్‌ 21) జరిగిన బిగ్ బాస్‌ 9 తెలుగు గ్రాండ్‌ ఫినాలేలో కళ్యాణ్‌ కప్పు గెలిచి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. బిగ్‌బాస్‌ విన్నింగ్‌ తర్వాత బయటకు వచ్చిన కళ్యాణ్‌ మొదట బజ్ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. తాజాగా కళ్యాణ్‌ పడాల బజ్‌ ఇంటర్య్వూకి సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇందులో కళ్యాణ్‌ గెలుపుపై బజ్ హోస్ట్‌ శివాజీ ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ ఇచ్చాడు. సామాన్యుడు సంచనలం సృష్టించాడంటూ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించాడు. సోల్జర్‌ కళ్యాణ్‌ పడాల అంటూ బజ్‌ ఇంటర్య్వూలో స్వాగతం పలికాడు శివాజీ.

దివ్య వల్లే ఈ గెలుపు?

ఇక కప్పుతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్‌తో శివాజీ ఇలా అన్నాడు. నిన్ను చూస్తుంటే ఒకటి చెప్పాలనుంది.. తననే తనని చెక్కుకున్న శిల్పి వీడు అంటూ కితాబు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ గెలుపు కారణం దివ్య అంటే ఒప్పుకుంటావా? అనగానే అవును అన్నట్టు తలూపాడు. హౌజ్‌లో తనలో స్పిరిట్‌ నిప్పింది దివ్యనే అని శివాజీ అనగానే.. కళ్యాణ్‌ ఆమెకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఆ తర్వాత హౌజ్‌లో ఏంటి? అంతా నీకు చూట్టాలే ఉన్నారు.. అత్త, గర్ల్‌ఫ్రెండ్‌, ఎక్స్‌ ఏంటి ఇదంత అని కళ్యాణ్‌ని ఆటపట్టించాడు. ఆ తర్వాత తనూజ కోసం నామినేషన్‌లో వెళ్తానని తనే స్వయంగా ముందుకు రావడం? హౌజ్‌ లో తనూజ స్నేహం, సన్నిహిత్యంపై పలు ప్రశ్నలు అడిగాడు. 

Advertisement

గొప్ప నటుడిని అవ్వాలి..

ఆ తర్వాత డిమోన్‌ పవన్‌.. రూ. 15 లక్షల సూట్‌కేస్‌ తీసుకేళ్లడంపై కళ్యాణ్‌ అభిప్రాయం అడిగారు. మొత్తానికి అగ్నీ పరీక్షకు వచ్చిన మీరు మీరు ఫ్రెండ్స్‌ డబ్బులు బాగా పంచుకున్నారంటూ కళ్యాణ్‌ అడగ్గా.. వాడు, నేను ఇద్దరం మిడిల్‌ క్లాస్.. డబ్బులు మా ఇద్దరికి ముఖ్యమే అన్నట్టుగా కళ్యాణ్‌ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేద్దామని అనుకుంటున్నావని అడగ్గా.. స్టార్‌, హీరో అని కాకుండ తను ఒక గొప్ప నటుడిని కావాలని అనుకుంటున్నా అన్నాడు. చివరిగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ అయినందుకు కేక్‌ కట్‌ చేసి తన విన్నింగ్‌ని సెలబ్రేట్‌ చేశాడు శివాజీ.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×