Bigg Boss 9 Telugu Day 75 : బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టకేలకు నేటితో ఫ్యామిలీ వీక్ కి ఫుల్ స్టాప్ పడింది. ఈరోజు ఇమ్మాన్యుయేల్ మదర్ రాకతో ఈ ఎమోషనల్ సీన్స్ కు తెర పడింది. తరువాత కెప్టెన్సీ టాస్క్ ఉండడంతో హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.
హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు ఒక్క ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ తప్ప. ఆ లోటును ఈరోజు తీర్చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇమ్మూ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో కావాలని కోరింది. ఆ పట్టిలు, గాజులు నేనే కొనిచ్చా అంటూ తన మదర్ ను ఆహ్వానించాడు. ఇమ్మూ తల్లి అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం హార్ట్ టచింగ్ గా అన్పించింది. “ఏ బంగారాన్ని నేను వద్దు అనుకున్నానో ఆ బంగారమే ఈరోజు రెండు రాష్ట్రాలలో మంచి పేరు తెస్తోంది. నువ్వు ఏడవొద్దే. నువ్వేడిస్తే మా ఎనర్జీ మొత్తం పోతుంది. కమెడియన్ లాగా హౌస్ లోకి వచ్చావ్. బయటకు మాత్రం హీరోలా రావాలి” అంటూ ఇమ్మూకి మంచి ఎనర్జీ ఇచ్చింది. ఇక తనూజా ఇమ్మూ నడుము గిల్లడం నుంచి రాణి దివ్య అతనితో స్టెప్పులు వేయించడం వరకు అన్ని విషయాల గురించి ఆవిడ డిస్కస్ చేశారు. వెళ్తూ వెళ్తూ ఫన్నీగా తన కొడుకును నామినేట్ చేయమన్నారు. ఆమె వెళ్లిపోయాక ఇమ్మూ లవర్ నుంచి లెటర్ వచ్చింది. ఇంట్లో ఒప్పించాను అనే గుడ్ న్యూస్ తో పాటు రింగ్, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంపింది ఇమ్మూ గర్ల్ ఫ్రెండ్.
బిగ్ బాస్ 11వ వారం కెప్టెన్సీ పోటీ కోసం హౌస్ మేట్స్ ను రెడ్ టీం, బ్లూ టీం అంటూ రెండు టీంలుగా విడగొట్టారు. బ్లూ టీంలో కళ్యాణ్, డెమోన్, రీతూ, సుమన్…. రెడ్ టీంలో భరణి, దివ్య, సంజన, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. రెండు టీమ్స్ కు ఇస్తున్న కెప్టెన్సీ టాస్క్ హంగ్రీ మాన్స్టర్. మాన్స్టర్ కు ఆకలేసిన ప్రతీసారి దాని కడుపులో ఉన్న లివర్ రెడ్ వైపు పెడితే రెడ్ లైట్, బ్లూ వైపు పెడితే బ్లూ లైట్ వెలుగుతుంది. మాన్స్టర్ ఎవరిని తింటే వారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టే.
అయితే మొదటి రౌండ్ లో ఎవరు వెళ్లాలన్న డిస్కషన్ రాగా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇమ్మాన్యుయేల్ మొదటి నుంచి గేమ్స్ అన్నీ కూడా కష్టపడి పడి ఆడుతున్నాను. ఇప్పుడు వెళ్లాలంటే నా వల్ల అస్సలు కాదు అంటూ తన టీం ముందు పాయింట్ పెట్టాడు. అంతలోనే సంజన వెళ్లి రెడ్ నొక్కేసింది. ఇక తరువాత సంజన ప్లాన్ ఇదే. నెక్స్ట్ నేనూ నువ్వూ ఉంటాము. దివ్యతో నేను వెళతా’ అంటూ కళ్యాణ్ రీతూతో కలిసి స్ట్రాటజీ ప్లాన్ చేశాడు.
మరోవైపు దివ్య నేను టాస్క్ ఆడి గెలిచాను కాబట్టే నన్ను కంటెండర్ ను చేశారు అని భరణిపై ఫైర్ అయ్యింది. ‘అదొక్కటే పట్టుకున్నావ్. నావల్ల నీకు ఏ హెల్ప్ జరగలేదా ?’ అని భరణి అడగడంతో… మీరిద్దరే కూర్చుని ఆదుకోండి అంటూ సెకండ్ రౌండ్ లో వెళ్ళడానికి సిద్ధమైంది. బ్లూ టీం నుంచి కళ్యాణ్ వెళ్లగా, సంజన – దివ్య కలిసి అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇక ఈ రెండు టీమ్ లకు పోటీ పెట్టగా, చివరకు రీతూ -సుమన్ శెట్టి మిగిలిపోయారు.
అంతకంటే ముందు బిగ్ బాస్ ఈ హౌస్ లో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో వారిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించమని ఆదేశించారు. దీంతో దివ్య తనూజా మధ్య బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. “నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నీకు 12వ వారం చివరి వరకూ అది ఉంది. ఆ విధంగా నిన్ను ఈ రేసు నుంచి తొలగిద్దాం అనుకుంటున్నా తనూజా” అంటూ బాంబు పేల్చింది దివ్య. “నేను ఆడి గెలుచుకున్నా. నేను ఎవ్వరినీ సంతోష పెట్టలేదు. నేను నీ బిహేవియర్ పరంగా చెబుతున్నా. ప్రతీ దాంట్లో అదే తీసుకొస్తావ్” అని తనూజ అరిచింది.
“బిహేవియర్ ఏంటి ? నేను గేమ్ పరంగా చెబుతున్నా. తప్పు తప్పుగా చెప్పకు తనూజా నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తాను తనూజ. 100% రీజన్ చెప్పాను” అని దివ్య మరింత ఫైర్ అయ్యింది. ‘సర్లే చెప్పావ్ పో’ అని తనూజ అంటే “పో ఏంటి పో… నువ్వెవరు నాకు చెప్పడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఈ ఎగతాలే” అని దివ్య అనేలోపు… “కావాలని నా మీదే పడతావ్. ఏడుస్తున్నావ్ అంటూ ఏదేదో అంటావ్” అని తనూజా అంటే… “10 సార్లు ఏడ్చావ్. తనూజ తనూజ అంటూ నీ చుట్టూ భజన చేసుకుంటూ ఉండాలి” అని దివ్య… ‘ ఇక్కడ కూడా రివ్యూ ఇచ్చుకో. నన్ను ఎక్స్పోజ్ చేయడానికి వచ్చిందట. బయట సరిపోక ఇక్కడకొచ్చావ్’ అని తనూజా… ‘ నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోను’ అని దివ్య… ‘నీలాగా మనిషి ఇష్టం లేదని బిహేవియర్ లో చూపించినా వెనక పడను’ అని దివ్య ఓ రేంజ్ లో ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్ కు దిగారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ ఇద్దరూ.
Read Also : కళ్యాణ్ తల్లికి తనూజా స్పెషల్ గిఫ్ట్… పర్సనల్ కాదంటూనే ఇదేం పని పాపా?