E-Paper
Advertisement

వేసవిలో గోంద్ కటిరా తింటున్నారా? ఈ సమస్యలున్నవారు అసలు తినకూడదు

వేసవిలో గోంద్ కటిరా తింటున్నారా? ఈ సమస్యలున్నవారు అసలు తినకూడదు
Advertisement
Gond Katira Side Effects| గోంద్ కటిరా వేసవి కాలంలో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి చల్లదనం, హైడ్రేషన్ ఇస్తుంది. ఇది మొక్కల నుంచి వచ్చే గమ్ లాంటి ద్రవ పదార్థం. చాలా నేచురల్. సాధారణంగా వీటిని రాత్రి పూట నానబెట్టి ఆ తరువాత తినాలి. వేడి వాతావరణంలో దీన్ని శర్బత్ లో కలిపి తాగితే రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గోంద్ కటీరా తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లీమా మహజన్ గోంద్ కటిరా సైడ్ ఎఫెక్ట్స్ గురించి సోషల్ మీడియాలో వివరించారు.

గోంద్ కటిరా అంటే ఏమిటి?

గోంద్ కటిరాను ట్రాగాకాంత్ గమ్ అని కూడా అంటారు. నీటిలో కొన్ని గంటలు నానబెట్టితే ఇది జెల్లీ లాగా మారుతుంది. పాలు, నీరు లేదా షర్బత్‌తో కలిపి తాగడానికి బాగుంటుంది. వేసవి కాలంలో దీని వల్ల లభించే చల్లదనం కారణంగా బాగా ప్రజాదరణ పొందింది. చాలా మంది సాంప్రదాయ వేసవి పానీయాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఫైబర్, సహజ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి.

హెవీ పీరియడ్ క్రాంప్స్ ఉన్న మహిళలు తినకూడదు

మహిళలు ఋతుస్రావ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ లీమా మహజన్ సూచిస్తున్నారు. తీవ్రమైన క్రాంప్స్ ఉన్న మహిళలు గోంద్ కటిరాను తాత్కాలికంగా మానేయాలి. దీని చల్లని స్వభావం మహిళల ఋతు ప్రవాహాన్ని ప్రభావితం చేయవచ్చు. పీరియడ్స్ రావడానికి ముందు, ఆ  సమయంలో తినకూడదు. కొంతమంది మహిళలు తిన్న తర్వాత అసౌకర్యం ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతి వ్యక్తికి అన్ని ఆహారాలు సరిపడవు. గోంద్ కటీరా తింటే శరీరం ప్రతిస్పందన ప్రతి వ్యక్తికి వేరుగా ఉంటుంది.

తక్కువ బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

తక్కువ రక్తపోటు ఉన్నవారు గోంద్ కటిరా తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇది రక్తపోటును మరింత తగ్గించే అవకాశం ఉంది. దీని వల్ల బలహీనత, తల తిరగడం లేదా శక్తి తగ్గడం వంటివి రావొచ్చు. బీపీ మందులు వాడేవారు రోజూ తినకూడదు. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తినాలి. అలర్జీ లాంటి సున్నిత ఆరోగ్య సమస్యలున్నవారికి కూడా  వైద్య సలహా చాలా ముఖ్యం.

ఇరిటెబుల్ బొవెల్ సిండ్రోమ్ లేదా బ్లోటింగ్ సమస్యలు ఉన్నవారు

గోంద్ కటిరాలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు ఇది సాయపడుతుంది. విరేచనాల సమస్య ఉన్నవారికి దీని వల్ల కడుపులో ఉబ్బరం సమస్య రావొచ్చు. ఇరెటెబుల్ బొవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి బ్లోటింగ్ లేదా కడుపు అసౌకర్యం మరింత ఎక్కువ కావొచ్చు. అధికంగా తినడం వల్ల గ్యాస్, అజీర్ణ సమస్యలు పెరుగుతాయి. అందుకే చాలా చిన్న మొత్తంతో ప్రారంభించాలి.

మందులతో కలిపి తినకూడదు

మందులతో పాటు గోంద్ కటిరా తీసుకోవడం మంచిది కాదు. దీని జెల్లీ లాంటి నిర్మాణం మందుల డైజెషన్ ప్రభావితం చేయవచ్చు. అందుకే కొంత  గ్యాప్ ఇచ్చి తినాలి. డాక్టర్ సూచించిన మందులతో వెంటనే తినకూడదు. వైద్య సలహా తీసుకోవడం ద్వారా అనవసర సమస్యలను నివారించవచ్చు.

తప్పుగా తినడం వల్ల జీర్ణ సమస్యలు

వేసవిలో చాలా మంది గోంద్ కటిరాను తప్పుగా తింటారు. అధిక మొత్తంలో తినడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. నిపుణులు రోజుకు ఒకటి లేదా రెండు టీస్పూన్లు మాత్రమే సూచిస్తారు. అధికంగా తినడం వల్ల మలబద్ధకం, బ్లోటింగ్ లేదా కడుపు భారం అనిపించవచ్చు. నానబెట్టకుండా పొడిగా తినకూడదు. పొడి గోంద్ కటిరా కొండెమీద అడ్డుకునే ప్రమాదం కూడా ఉంది.

ఐస్ క్రీమ్ కోల్డ్ డ్రింక్స్‌తో కలపకండి

చాలా మంది గోంద్ కటిరాను ఎక్కువగా చల్లని ఐస్ క్రీమ్స్, లేదా కోల్డ్ డ్రింక్స్‌తో కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం జీర్ణక్రియను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని చల్లదనం ఇప్పటికే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అధిక ఐస్ వాడడం కడుపు అసౌకర్యాన్ని పెంచుతుంది. సాధారణ లేదా తేలికపాటి చల్లని పానీయాలు మంచివి.

గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకోవాలి

గర్భిణీలు కొత్త ఆహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. గోంద్ కటిరా తినే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి. గర్భావస్తలో ఉన్నవారికి గోంద్ కటీరా వల్ల సమస్యలు రావొచ్చు. వైద్య సలహా తీసుకోవడం తల్లి, బిడ్డ భద్రతకు మంచిది. ఒకవేళ తిన్నా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.

గోంద్ కటిరా సురక్షితంగా ఎలా తినాలి?

రాత్రి పూట సరిగ్గా నానబెట్టి తినాలి. రోజుకు చిన్న మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి. ఉదయం నీరు లేదా మజ్జిగతో తీసుకోవడం మంచిది. రోజంతా తగినంత నీరు తాగాలి. ఆరోగ్య సమస్యలు లేనివారు మోడరేట్‌గా తినవచ్చు.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×