E-Paper
Advertisement

Breast Cancer: మనదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది

Breast Cancer: మనదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది
Advertisement

భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కానీ అసలు సమస్య ఏమిటంటే ఈ వ్యాధి చాలా మందికి చాలా ఆలస్యంగా బయటపడుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లే సమయానికి క్యాన్సర్ ఇప్పటికే ఎక్కువగా పెరిగి కొన్ని సందర్భాల్లో శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించేస్తుంది. దీని వల్ల చికిత్స కూడా కష్టమవుతోంది. దీనివల్ల కోలుకునే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మన దేశంలో లేట్ స్టేజ్‌లో క్యాన్సర్ గుర్తించే కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎందుకు తెలియడం లేదు
కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్ చాలా సైలెంట్‌గా పెరుగుతుంది. మొదట్లో ఎలాంటి పెద్ద లక్షణాలు కనిపించవు. గడ్డలు కూడా స్పష్టంగా తెలియకపోవచ్చు. అందుకే చాలా మంది మహిళలు సమస్యను గుర్తించలేరు. కొన్నిసార్లు చిన్న నొప్పి లేదా మార్పులు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇలా లక్షణాలు కనిపించకుండా ఉండటం వల్ల వ్యాధి ముందే గుర్తించడం కష్టమవుతోంది. ఇంకో ముఖ్యమైన కారణం ఆరోగ్య సేవల్లో ఉన్న తేడాలు. పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పరీక్షలు త్వరగా చేయించుకునే అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాంటి సదుపాయాలు అంతగా ఉండవు. డాక్టర్‌ను కలవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు పరీక్షలు చేయించుకోవడానికి డబ్బు సమస్య కూడా ఎదురవుతుంది. ఈ కారణాల వల్ల చాలా మంది మహిళలు ఆలస్యంగా హాస్పిటల్‌కు వెళ్తున్నారు.

Advertisement

Also read: Simple Facepack: కలబంద జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల గురించి సరైన సమాచారం లేదు. ఛాతీలో గడ్డ కనిపించినా లేదా మార్పులు వచ్చినా భయంతో లేదా నిర్లక్ష్యంతో డాక్టర్‌ను సంప్రదించరు. ఇది పెద్ద సమస్య కాదు అని భావించి వాయిదా వేస్తారు. అలాగే మన సమాజంలో ఈ విషయంపై మాట్లాడటానికి కొంత సంకోచం కూడా ఉంటుంది. ఈ కారణాలు కలిసి వ్యాధి ఆలస్యంగా బయటపడేలా చేస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. మహిళలు రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకోవాలి. చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు పెంచాలి. ముఖ్యంగా మహిళల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

Advertisement

Also read: Kedarnath Yatra: కేదార్ నాథ్ యాత్రకు వెళుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×