E-Paper
Advertisement

Dry Eyes Deficiency: పొడిబారిన కళ్లు, తక్కువ రోగ నిరోధక శక్తితో బాధపడుతున్నారా? శరీరంలో ఆ విటమిన్ లోపమే కారణం

Dry Eyes Deficiency: పొడిబారిన కళ్లు, తక్కువ రోగ నిరోధక శక్తితో బాధపడుతున్నారా? శరీరంలో ఆ విటమిన్ లోపమే కారణం
Advertisement

Dry Eyes Deficiency| చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా శరీరంలో పోషకాల లోపాన్ని సూచిస్తాయి. పొడిబారిన కళ్లు, బలహీనమైన రోగనిరోధక శక్తి కూడా ఇలాంటి సంకేతాలే. చాలా మంది ఈ లక్షణాలను ప్రారంభ దశలో పట్టించుకోరు. కానీ ఇవి విటమిన్ ఎ (Vitamin A) లోపాన్ని సూచిస్తాయి. విటమిన్ ఏ.. కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.

విటమిన్ ఎ ఎందుకు అవసరం

కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా అవసరం. కళ్లలో తేమను నిలువ చేసి పొడిబారకుండా కాపాడుతుంది. దీంతో కళ్లలో చికాకు, పొడిబారే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. ‘విటమిన్ ఎ’ లోపం ఉంటే ఈ రెండు విధులు దెబ్బతింటాయి.

‘విటమిన్ ఎ’ లోపం లక్షణాలు

Advertisement

కళ్లు పొడిబారడం అతి ముఖ్యమైన లక్షణం. కళ్లలో పారదర్శకంగా ఉండే కార్నియా భాగం తేమ కోల్పోయి, కళ్లు ఎర్రబడవచ్చు. కళ్లపై తెల్లటి లేదా బూడిద రంగు మచ్చలు కనిపించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కళ్లకు తీవ్ర నష్టం జరగవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో కంటిచూపు కోల్పోయే అవకాశం ఉంది.

రోగనిరోధక శక్తి బలహీనపడటం మరొక ముఖ్య లక్షణం. తరచుగా జలుబు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. శరీరం బ్యాక్టీరియా, వైరస్‌లతో సమర్థవంతంగా పోరాడలేదు.

ఇతర సంకేతాలు

Advertisement

తక్కువ లైటింగ్‌లో చూడడం కష్టంగా ఉండటం (నైట్ బ్లైండ్‌నెస్) కూడా ‘విటమిన్ ఎ’ లోపానికి సంకేతం. చర్మం పొడిబారి, గట్టిపడటం, గాయాలు త్వరగా మానకపోవడం వంటివి కూడా లక్షణాలు.

‘విటమిన్ ఎ’ ఉండే ఆహారాలు

  • శరీరంలో ‘విటమిన్ ఎ’ లెవెల్స్ పెంచడానికి ఈ ఆహారాలు తినాలి
  • క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
  • స్వీట్ పొటాటోలో కూడా విటమిన్ ఎ మెండుగా ఉంటుంది.
  • బ్రొకలీ, పాలకూర లాంటి కూరగాయలలో ఉన్న మంచి పోషకాలలో విటమిన్ ఎ కూడా ఒకటి.
  • బొప్పాయి, మామిడి తింటే శరీరంలో విటమిన్ స్థాయి పెరుగుతుంది.
  • పాలు, కోడి గుడ్డు సొన, చేప నూనెలో విటమిన్ ఎ ఉంటుంది.

భోజనంలో భాగంగా ఇవి క్రమం తప్పకుండా తింటే విటమిన్ లోపం సమస్య క్రమంగా పరిష్కారమవుతుంది.

Also Read:  మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

విటమిన్ ఎ లోపం చాలా సీరియస్

విటమిన్ ఎ లోపం కాలక్రమేణా తీవ్రమవుతుంది. ప్రారంభ లక్షణాలు చిన్నవిగా అనిపించినా, నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.

ముఖ్యగమనిక: ఈ కథనంలో తెలిపిన ఆరోగ్య సమ్యల పరిష్కారాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.  సరైన చికిత్స కోసం తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని సూచన.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×