E-Paper
Advertisement

ధృడమైన శరీర బలంతో 100 ఏళ్లకు పైగా బతికిన మహాభారత కాలం మనుషులు.. వారి దీర్ఘాయుష్షుకు వెనుక రహస్యం ఇదే

ధృడమైన శరీర బలంతో 100 ఏళ్లకు పైగా బతికిన మహాభారత కాలం మనుషులు.. వారి దీర్ఘాయుష్షుకు వెనుక రహస్యం ఇదే
Advertisement

ప్రస్తుత కాలంలో చాలా మంది సగటున 60 నుంచి 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు. అయితే మహాభారత కాలంలో ప్రజలు 100 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా జీవించారని పురాణాలు చెబుతున్నాయి. పైగా కొందరు మహాపురుషులు ధృడమైన శరీర బలంతో 200 ఏళ్లకు పైగా కూడా బతికారని కథనాలున్నాయి. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తారు.

ప్రాచీన కాలంలో ఎక్కువ ఆయుష్షు ఉండేది

మహాభారత కాలంలో యోధులు, ఋషులు, మహానుభావులు 90 నుంచి 130 సంవత్సరాల వరకు ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించారని కథనాలున్నాయి. శ్రీకృష్ణుడు కూడా 100 సంవత్సరాలకు పైగా జీవించారని చెబుతారు. అలాగే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు వంటి మహాయోధులు 100 నుంచి 200 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా శక్తివంతంగా ఉండేవారు.

భీష్మ పితామహుడి క్రమశిక్షణ

Advertisement

భీష్మ పితామహుడు తన జీవితమంతా కఠినమైన నియమాలను పాటించారు. ఆయన బ్రహ్మచర్యాన్ని అనుసరించారు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు, నెయ్యి వంటి సహజ ఆహారాన్ని తీసుకునేవారు. అతిగా తినకుండా నియంత్రణ పాటించేవారు. ఈ క్రమశిక్షణే ఆయన ఆరోగ్యానికి ప్రధాన కారణమని భావిస్తారు.

ద్రోణాచార్యుడి ఆరోగ్య రహస్యం

ద్రోణాచార్యుడు కూడా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించారు. ఆయన యుద్ధ విద్యలో నిపుణుడు మాత్రమే కాకుండా యోగ సాధనలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండేవారు. ప్రతిరోజూ సాధన చేయడం, శారీరక వ్యాయామం చేయడం. సాత్విక పోషకాహారం తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంగా ఉండేవారు.

రోజువారీ జీవనశైలే అసలు రహస్యం

Advertisement

మహాభారత కాలంలోని ప్రజలు తెల్లవారుజామునే నిద్రలేచేవారు. యోగ, ధ్యానం వంటి సాధన ప్రతిరోజూ చేసేవారు. వారు నిర్ణీత సమయానికి భోజనం చేసేవారు. శారీరక శ్రమకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచేవి.

సాత్విక ఆహారం ముఖ్య పాత్ర

ఆ కాలంలో ప్రజలు సహజమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, పాల ఉత్పత్తులు వారి ఆహారంలో ప్రధానంగా ఉండేవి. అధిక మసాలాలు, ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి పదార్థాలు ఉండేవి కావు. నియంత్రిత ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచింది.

కాల గణన విధానం భిన్నంగా ఉండేది

ప్రాచీన భారతదేశంలో చంద్ర, సౌర క్యాలెండర్లను ఉపయోగించేవారు. చంద్ర సంవత్సరంలో 354 రోజులు ఉండేవి.
అందువల్ల అప్పటి వయస్సు లెక్కింపు విధానం నేటి విధానంతో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తారు.

Also Read: చిన్నారుల కోసం ఈ బేబీ ప్రొడక్ట్స్ కొనకూడదు.. తల్లిదండ్రులకు డాక్టర్ల హెచ్చరిక

నేటి జీవితానికి నేర్చుకోవాల్సిన పాఠాలు

ప్రస్తుతం ఒత్తిడి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మహాభారత కాలం ప్రజల జీవనశైలి మనకు మంచి మార్గదర్శకంగా ఉంటుంది. త్వరగా లేవడం, యోగ చేయడం, ధ్యానం చేయడం, తాజా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మహాభారత కాలంలోని ప్రజలు క్రమశిక్షణ, సాత్విక ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీర్ఘాయుష్షు పొందారని చెబుతారు. వారి అలవాట్లు నేటికీ ఆరోగ్యకరమైన జీవితానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×