E-Paper
Advertisement

పిల్లల్లో బూతులు మాట్లాడే అలవాటును మార్చడం ఎలా? పేరెంటింగ్ టిప్స్!

పిల్లల్లో బూతులు మాట్లాడే అలవాటును మార్చడం ఎలా? పేరెంటింగ్ టిప్స్!
Advertisement

Child Behaviour :బూతులు…పెద్దవాళ్ళు మాట్లాడితే చెవులు మూసుకుంటారు .అదే చిన్న పిల్లలు  మాట్లాడితే నప్పుడు చుట్టుపక్కల వాళ్లకు చూపిస్తూ మురిసిపోతుంటారు. కానీ,అదే మనం చేసే అతి పెద్ద తప్పని తెలుసుకోవాలి. పిల్లలు మట్టి ముద్దలాంటి వాళ్లు, మనం ఏ ఆకారం ఇస్తే ఆ ఆకారంలోకి మారతారు. ముఖ్యంగా రెండు నుండి ఎనిమిదేళ్ల వయసులో పిల్లలకు ఇమిటేషన్  చాలా ఎక్కువ.

ఇంట్లో పెద్దలు, టీవీలు, లేదా స్మార్ట్‌ఫోన్లలో చూసే ప్రతి విషయాన్ని, వినే ప్రతి పదాన్ని ఈజీగా క్యాచ్ చేసేస్తారు . అయితే, కొన్నిసార్లు అర్థం తెలియకుండానే వాళ్లు కొన్ని అసభ్య పదాలు మాట్లాడేస్తుంటారు. ఆ సమయంలో తల్లిదండ్రులు లేదా ఇంట్లోని పెద్దలు గట్టిగా నవ్వడం, లేదా అరేయ్ వీడు భలే మాట్లాడుతున్నాడే అని మురిసిపోవడం చేస్తుంటారు. సైకాలజీ ప్రకారం, పిల్లలు తాము మాట్లాడే పదాల అర్థం కంటే, వాటికి ఎదుటివారి నుండి వచ్చే రియాక్షన్ ని బట్టి ఆ ప్రవర్తనను అలవాటు చేసుకుంటారు. మీరు నవ్వితే, అది వారికి ఒక పాజిటివ్ సిగ్నల్‌గా మారుతుంది. నేను ఈ పదం అంటే అందరూ సంతోషిస్తున్నారు, కాబట్టి ఇది మంచి పదం అనే భ్రమలో పిల్లలు ఉండిపోతారు.

Advertisement

టెన్షన్  కోసం ఆరాటం 

చైల్డ్  సైకాలజీ  ప్రకారం పిల్లలు సమాజంలో లేదా ఇంట్లో అటెన్షన్ అంటే గుర్తింపు కోసం ఆరాటపడతారు. ఒకవేళ పిల్లలు బూతులు మాట్లాడినప్పుడు మీరు అతిగా కోప్పడినా, కొట్టినా, లేదా షాక్ అయినట్లు మొహం పెట్టినా.. అది కూడా ఒక రకమైన అటెన్షనే అవుతుంది. పెద్దలు ఎక్కువగా రియాక్ట్ అయిన ప్రతిసారీ, పిల్లలు ఆ పదాన్ని మళ్లీ మళ్లీ వాడటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే, ఆ పదం అనగానే ఇంట్లో ఒక రకమైన హడావుడి జరుగుతుందనే విషయం వారి పసి మనస్సుకు నచ్చుతుంది. అందుకే, పిల్లల నోట అసభ్య పదం వచ్చినప్పుడు నవ్వడం ఎంత తప్పో, లబోదిబోమంటూ అతిగా ఆవేశపడటం కూడా అంతే తప్పు.
ప్రస్తుత రోజుల్లో పిల్లలు బూతులు నేర్చుకోవడానికి కేవలం ఇల్లే కారణం కానక్కర్లేదు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ వీడియోల్లో వచ్చే ట్రెండింగ్ డైలాగులను పిల్లలు ఈజీగా ఫాలో అయిపోతున్నారు. వయసుకు మించిన కంటెంట్ చూడటం వల్ల, ఏది సామాజికంగా మాట్లాడదగిన భాషో, ఏది కాదో తెలియని డైలామాలో పడిపోతున్నారు.

Advertisement

ఇదే వారి ఎదుగుదలకి పెద్ద దెబ్బ

ఇంట్లో సరదాగా అనిపించిన ఈ అలవాటు, పిల్లలు స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించాక పెద్ద సమస్యగా మారుతుంది. తోటి పిల్లలతో లేదా టీచర్లతో మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఈ పదాలు వాడేస్తారు. దీనివల్ల స్కూల్ నుండి కంప్లైంట్స్ రావడం, మిగతా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను వీరికి దూరంగా పెట్టడం జరుగుతుంది. అలాగే కోపం వస్తే బూతులు మాట్లాడటం ద్వారానే దాన్ని బయటపెట్టాలని  తప్పుడు మైండ్‌సెట్ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోతుంది. ఇదే వారి ఎదుగుదలకి పెద్ద దెబ్బ.ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పిల్లాడు మొదటిసారి ఒక తప్పుడు పదం వాడినప్పుడు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా నార్మల్‌గా ఉండాలి.
మీ నుండి ఎలాంటి స్పందన రాకపోతే ఆ పదం పవర్ లేనిదని వాళ్లే వదిలేస్తారు. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చోబెట్టి, ఆ పదం అనడం వల్ల ఎదుటివారు ఎంత బాధపడతారో సున్నితంగా వివరించాలి. మంచి పిల్లలు ఇలాంటి పదాలు మాట్లాడరు అని ప్రేమగా గైడ్ చేయాలి.

బూతులు మాట్లాడటం మానేస్తారు కదూ

పిల్లల కంటే ముందు ఇంట్లో పెద్దలు తమ భాషను అదుపులో ఉంచుకోవాలి. మనం మాట్లాడే ప్రతి పదాన్నీ పిల్లలు  కనిపెడుతూ ఉంటారని . కోపం వచ్చినప్పుడు లేదా అసంతృప్తిగా ఉన్నప్పుడు బూతులు కాకుండా, నాకు కోపంగా ఉంది, నాకు ఇది నచ్చలేదు అని స్పష్టంగా చెప్పడం అలవాటు చేయాలి. పిల్లలకు చిన్న వయసులోనే మంచి భాష, సంస్కారం నేర్పించడం అనేది వారి భವಿష్యత్తుకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి.ఇప్పటికైనా పిల్లల ముందు బూతులు మాట్లాడటం మానేస్తారు కదూ !

Also read :అరడజను సినిమాలు.. అంతంతమాత్రం బజ్.. ఆ సినిమా అయినా వర్కవుట్ అవుతుందా?

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×