E-Paper
Advertisement

తేడా వస్తే ఊరుకోను.. ఇంజనీర్లకు కలెక్టర్ ప్రతిమా సింగ్ వార్నింగ్..!

తేడా వస్తే ఊరుకోను.. ఇంజనీర్లకు కలెక్టర్ ప్రతిమా సింగ్ వార్నింగ్..!
Advertisement

Women Empowerment: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో మహిళా సాధికారతకు వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని. ధ్యాన్చంద్ చౌరస్తా ఏరియా దగ్గర ఉన్న గాంధీనగర్ ఏరియాలో నిర్మాణం తుది దశకు చేరుకున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల సంబంధిత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ నరసింహులుతో కలిసి పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో మంజూరై ఇందిరాస్ మహిళా శక్తి భవనం నిర్మాణం చేపట్టి తుది దశకు చేరుకుందని ఇంకా మిగిలి ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని, మహిళల శిక్షణకు, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనాన్ని ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Also read: ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న ప్రాంతీయ శక్తులు.. కింగ్ మేకర్ల చేతిలో జాతీయ పార్టీల జాతకం!

స్వయం సహాయక సంఘాలు

భవన నిర్మాణ ప్లాన్లు, గదుల నిర్మాణం, మౌలిక వసతుల పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిని ప్రతి రోజూ పర్యవేక్షించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పరిశీలనలో పంచాయతీ రాజ్ ఈఈ నరసింహులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also read: టీచర్లను కింద కూర్చోబెట్టిన పెద్ద మేడమ్స్.. వలిగొండ మండలంలో దారుణం..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×