E-Paper
Advertisement

Black Threads: కాళ్లకే ఎందుకు నల్ల దారమే కడతారు? కారణం వింటే షాక్ అవుతారు

Black Threads: కాళ్లకే ఎందుకు నల్ల దారమే కడతారు? కారణం వింటే షాక్ అవుతారు
Advertisement

Black Threads: మనిషి శరీరాన్ని, మనసును, జీవితాన్ని రక్షించడానికి మన పూర్వికులు చెప్పిన ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఒకటే కాళ్లకి నల్ల దారం కట్టుకోవడం. బయట చూస్తే ఇది చాలా చిన్న పనిలా కనిపిస్తుంది. కేవలం ఒక దారం కాళ్లకి కట్టేస్తే ఏమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం, శాస్త్రీయ కారణం, ఆధ్యాత్మిక శక్తి ఇవి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇళ్లలో అప్పుడే జన్మించి పిల్లలకు వెంటనే కాళ్లకి నల్ల దారం కడతారు. పెద్దలకు కూడా శరీర బలహీనత ఉన్నప్పుడు కడతారు. దృష్టి పడితే, ఆరోగ్యం బాగా లేకపోతే, నెగటివ్ ఎనర్జీ ఎక్కువైపోతే నల్ల దారం పెట్టమని పెద్దలు చెబుతారు. కానీ అసలు ఎందుకు నల్లదారమే? ఎరుపు దారం ఉంది, పసుపు కూడా ఉంది… కానీ కాళ్లకి మాత్రం నల్లదారానికే ఎందుకు అంత విలువ? నిజం ఏమిటి? శాస్త్రం ఏమంటుంది? మన పూర్వికులు ఎందుకు ఇంతగా నమ్మారు? ఇప్పుడు ఆ రహస్యం పూర్తి వివరంగా తెలుసుకుందాం.

ఆధునిక శాస్త్రం ఏం చెబుతుంది?

Advertisement

మనిషి శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటి కాళ్లు. మన శరీరం మొత్తానికి కావాల్సిన శక్తి, ఉత్సాహం, ప్రాణవాయువు లాంటి ప్రతి ప్రవాహం కాళ్ల ద్వారా మొదలవుతుంది. నరాలు, రక్తప్రసరణ, శక్తి ప్రవాహం అన్నీ కాళ్ల నుంచే పైకి చేరతాయి. అందుకే ప్రపంచంలో ప్రతి సంస్కృతిలో కాళ్లకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మన పూర్వికులు చెప్పారనే కాదు, ఆధునిక శాస్త్రం కూడా దీనిని అంగీకరించింది. శరీరంలో నెగటివ్ ఎనర్జీని అకర్షించే ప్రధాన భాగం కూడా మన కాళ్లేనని నిపుణులు చెబుతున్నారు.

దృష్టి పడితే ఏమవు తుంది?

Advertisement

ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో కూడా చాలా మంది నల్ల దారం కడతారు. కారణం చాలా మంది అనుకుంటారు దృష్టి దూరం చేయడానికి అని. దృష్టి పడటం కొత్త విషయం కాదు. ఎవరో ఒకరు మన మీద ఎక్కువగా దృష్టిపెడితే, అసూయతో చూస్తే లేదా మనపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి మన విషయాలు చర్చిస్తే శరీరంలో శక్తి బ్యాలెన్స్ మారిపోతుంది. అది మన ఆరోగ్యానికి, మన మనసుకి ప్రభావం చూపుతుంది. దృష్టి పడినపుడు చాలామందికి అకస్మాత్తుగా అలసట, నిరుత్సాహం, తలనొప్పి, ఆందోళన అనుభవం వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న శక్తి ప్రవాహం దెబ్బతింటుంది. ఈ అనర్థాలన్నిటినీ అడ్డుకునే అత్యంత సులభమైన మార్గాల్లో ఒకటి నల్ల దారం.

Also Read: OnePlus 11 Pro 5G: ప్రీమియం సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ పోటీ.. 8000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 11 ప్రో ఇండియా లాంచ్

ఎందుకు నల్లనే.. ఎరుపు, పసుపు ఎందుకు కాదు?

అయితే ఎందుకు నల్లే? ఎరుపు, పసుపు రంగులు కాదు ఎందుకు? ప్రతి రంగుకి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తుంది, కానీ మనపై ప్రభావం పడకుండా బయటే అడ్డుకుంటుంది. అంటే మన మీదకు వచ్చే చేదు శక్తిని తనలో బంధించేస్తుంది. అందుకే నల్ల దారం కట్టిన దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపిల్లలు రాత్రిళ్లు నిద్రపోకపోవడం, నిరంతరం ఏడవడం, భయపడిపోవడం వంటి సమస్యలు కూడా దృష్టి కారణంగానే ఎక్కువగా ఉంటాయి. అందుకే చిన్నారులకి పాదం పైభాగంలో, తొడిమల దగ్గర నల్ల దారం కడతారు.

శరీరాన్ని రక్షించేది నల్ల దారమే

అంతేకాదు, కాళ్లు నేలని తాకే భాగం కాబట్టి అక్కడే శరీరంలోకి విద్యుత్తు ప్రవాహంలాంటి శక్తి మార్పులు ఎక్కువగా జరుగుతాయి. మనం బయట ఎక్కువసేపు తిరిగితే అలసట ఎందుకు ఎక్కువగా వస్తుంది. దానికి కారణం కూడా ఉంది, అదేమిటంటే నేలలో ఉన్న ఆధార శక్తి మన శరీర శక్తిని లాగేస్తుంది. అప్పుడు మన శరీరాన్ని రక్షించడానికి ఒక రక్షణలాగా పనిచేసేది కూడా నల్ల దారమే అని శాస్త్ర నిపుణులు తెలిపారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుండి బయటపడటానికి కూడా ఇది సహాయపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

మనం కాలంతో పాటు మర్చిపోతున్నాం

కేవలం నమ్మకం కాదు, శరీరంలో రక్త ప్రసరణను సరిచేసే శాస్త్రీయ కారణం కూడా ఉంది. కాలి మడమ దగ్గర, తొడిమ భాగాల్లో నరాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ సన్నగా కట్టిన నల్ల దారం నరాల బ్యాలెన్స్‌ని కాపాడుతుంది. అందుకే కొంతమంది నొప్పులు తగ్గుతాయని కూడా నమ్ముతారు. మన పెద్దలు శాస్త్రాన్ని చెప్పే పద్ధతి భిన్నం. వారు నేరుగా సైన్స్ చెప్పలేదు, కానీ ఆచారంగా పెట్టి మన రక్షణ కోసం పాటించమన్నారు. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనం కాలంతో పాటు మర్చిపోతున్నాం. కానీ ప్రతి పాత సంప్రదాయం వెనుక ఒక బలమైన శాస్త్రం ఉందని గుర్తుంచుకోవాలి.

పూర్వికులు చెప్పిన ప్రతి దానికి విలువ ఉంది

కాబట్టి కాళ్లకి నల్ల దారం కట్టుకోవడం కేవలం నమ్మకం కాదు. మన శరీరానికీ, మనసుకీ రక్షణ కవచం. పాజిటివ్ ఎనర్జీని పెంచి, నెగటివ్ ఎనర్జీని బయట అడ్డుకునే పవిత్రమైన పద్ధతి. అందుకే ఇప్పటికీ చాలా మంది దాన్ని విశ్వాసంగా కాక, అవసరంగా భావిస్తున్నారు. మన పూర్వికులు చెప్పిన ప్రతిదానికి విలువుంది. మన ఆరోగ్యాన్ని, శక్తిని, మనసును, మన జీవితం మొత్తం కాపాడే చిన్న విషయం ఇది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×