E-Paper
Advertisement

Akhanda 2: ఆంధ్ర కింగ్ తాలూకా సీన్ రిపీట్… అఖండ  కోసం రూ.4 కోట్లు ఇచ్చిన అభిమాని!

Akhanda 2: ఆంధ్ర కింగ్ తాలూకా సీన్ రిపీట్… అఖండ  కోసం రూ.4 కోట్లు ఇచ్చిన అభిమాని!
Advertisement

Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేస్తూ నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. దీంతో బాలకృష్ణ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటానికి కారణం లేకపోలేదు ఈ సినిమా కోసం ఫైనాన్షియర్ల నుంచి భారీ స్థాయిలో డబ్బును అధిక వడ్డీకి తీసుకువచ్చి సినిమాను నిర్మించారు అయితే ఇప్పుడు సినిమా విడుదల చేయాలి అంటే వారికి ఇవ్వాల్సిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడింది.

ఏరోస్ కంపెనీకి రూ.4 కోట్లు ఇచ్చిన అభిమాని?

అఖండ 2 వాయిదా పడటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా విడుదల కోసం చేస్తున్న పనులకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఇటీవల వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయనకు దిష్టి తగిలింది అంటూ ఏకంగా మాన్షన్ హౌస్ తో బాలయ్య కటౌట్ కు దిష్టి తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ అభిమాని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఒక సన్నివేశాన్ని రిపీట్ చేశారు. ఈ సినిమాలో ఉపేంద్ర సినిమా ఆగిపోతే హీరో రామ్ ఏకంగా మూడు కోట్లు ఎలాగైతే కట్టారో అచ్చం అదేవిధంగా బాలయ్య అఖండ సినిమా విడుదల కోసం అభిమాని 4 కోట్లు కట్టారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

అనాథలకు సాయం చేయొచ్చుగా..

బాలకృష్ణ సినిమా విడుదల కోసం ఏరోస్ కంపెనీకి ఒక అభిమాని నాలుగు కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి ఒక చెక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తేనే బాలయ్యకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పష్టం అవుతుంది. ఇక ఈ విషయంపై నేటిజన్ల నుంచి కూడా విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అదేదో ప్రొడక్షన్ కంపెనీకి ఇవ్వడం కాకుండా బాలకృష్ణ పేరుతో అనాధలకు సాయం చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నేను కూడా 10 కోట్ల రూపాయలు చెక్ మీద రాసి ఇలా ఫోటోలు షేర్ చేయగలను అంటూ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు ఎదురైనా ఫైనాన్స్ సమస్యలను పరిష్కరించే దిశగా టాలీవుడ్ సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా విభిన్న రీతిలో కామెంట్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక బాలకృష్ణ అభిమానులు మాత్రం అఖండ 2 నిర్మాతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలన్నీ ముందే చూసుకోవాలి కాని సినిమా విడుదలకు ముందు వాయిదా వేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇక బాలకృష్ణ సైతం నిర్మాతల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ సినిమాని త్వరలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

Also Read: Alia -Ranbir Kapoor: రూ.250 కోట్ల ఇంట్లోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ దంపతులు.. ఫోటోలు వైరల్!

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×