Round Plates: మనం ఆహారం తినే ప్లేట్లు ఎప్పుడూ గుండ్రంగానే ఉంటాయి. ఇంట్లోనే కాకుండా హోటల్, రెస్టారెంట్లు, టిఫిన్ బండ్లు ఇలా బయటకు ఎక్కడకి వెళ్లినా సరే.. అవి సర్కిల్ లో ఉన్న ప్లేట్లలోనే వడ్డిస్తారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే దీని వెనుక కేవలం సంప్రదాయమే కాకుండా.. సైన్స్, సౌకర్యం కూడా దాగి ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కొన్ని వందల సంవత్సరాల క్రితం.. ఇప్పటిలా ప్లేట్లను తయారు చేసే అత్యాధునిక మిషన్లు ఉండేవి కావు. కుమ్మరి చక్రమం మీదనే ఆహారం తినే ప్లేట్లను తయారు చేయాల్సి వచ్చేది. అయితే చక్రం తిరుగుతున్నప్పుడు మట్టికి గుండ్రటి ఆకారం ఇవ్వడం చాలా సులభం. అలా చతురస్రం లేదా ఇతర ఆకృతులను చేయడమంటే చాలా శ్రమతో కూడుకున్న పని. కాబట్టి సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకూ ఆహరం తినే ప్లేట్లను వృత్తాకారంలోనే డిజైన్ చేస్తూ వస్తున్నారు.
ఒకవేళ ప్లేట్లు నాలుగు వైపుల మూలలతో చతురస్రాకారంలో ఉంటే.. అవి త్వరగా చతురస్రపు ప్లేట్లకు ఉండే పదునైన మూలలు (Corners) త్వరగా విరిగిపోయే లేదా పగిలిపోయే అవకాశం ఉంటుంది. గుండ్రటి ప్లేట్లకు అంచులు బలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ కాలం వినియోగంలో ఉంటాయి.
ఒకవేళ ఆహారపు ప్లేట్లకు మూలలు ఉన్నట్లైతే.. అక్కడ పదార్థాలు ఇరుక్కుపోయి బ్యాక్టీరియా, వైరస్ పెరిగే ప్రమాదం ఉంటుంది. మూలలను సరిగ్గా క్లీన్ చేయకపోతే.. అవి మన శరీరంలోకి వెళ్లే అనారోగ్యానికి గురిచేయవచ్చు. కాబట్టి రౌండ్ల ప్లేట్లు వినియోగించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. పైగా పాత్రలను తోమడం కూడా చాలా సులభతరం అవుతుంది.
మన భారతీయ సంప్రదాయంలో చేత్తో భోజనం చేయడం ముఖ్యమైన అంశం. రౌండ్ ప్లేట్‌లో అన్నం, కూరలను కలపడం చాలా తేలికగా ఉంటుంది. ఒకే సమయంలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు వృత్తాకారంలో ఉండటం వల్ల.. అందరికీ వంటకాలు సమానంగా అందుతాయి.
గ్యాస్ట్రోఫిజిక్స్ (Gastrophysics) పరిశోధనల ప్రకారం.. ప్లేట్ ఆకారం మనం అనుభవించే రుచిపై ప్రభావం చూపుతుంది. గుండ్రటి ప్లేట్లలో వడ్డించిన ఆహారం మెదడుకు తీపిగా, నాణ్యమైనదిగా అనిపిస్తుందట. చతురస్రపు ప్లేట్లు ఆహారాన్ని కొంచెం ఉప్పగా లేదా ఘాటుగా ఉన్నట్లు భ్రమింపజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భోజనాన్ని తృప్తిగా చేశామన్న ఫీలింగ్ ను గుండ్రటి ప్లేట్లు కలిగిస్తాయని పేర్కొంటున్నాయి.
ఆయుర్వేదం ప్రకారం.. ఒక భోజనంలో ఆరు రుచులు (తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) తప్పకుండా ఉండాలి. ఈ ఆరు రుచులను చిన్న గిన్నెలలో (Katoris) ఒక పెద్ద రౌండ్ థాలి చుట్టూ అమర్చడం ద్వారా అది సంపూర్ణమైన, సమతుల్యమైన ఆహారంగా కనిపిస్తుంది. కాబట్టి చతురస్ర ప్లేట్లతో పోలిస్తే.. గుండ్రని వాటిలో ఆహారపదార్థాలను రౌండ్ గా పెట్టడం తేలికగా ఉండనుంది.
Also Read: రియల్‌మీ నయా ఫోన్స్.. రేపే విడుదల.. ఫీచర్లు కెవ్వు కేక!
మనం వేడి పదార్థాలను ప్లేట్‌లో వడ్డించినప్పుడు, గుండ్రటి ఆకారం వల్ల వేడి అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. చతురస్రం (Square) లేదా ఇతర ఆకారాల్లో మూలల (Corners) వద్ద వేడి త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గుండ్రటి ప్లేట్లలో ఆహారం ఎక్కువ సేపు సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది.
Also Read: మావిగన్ మామయ్య.. ఇలా దొరికావు ఏంటయ్యా.. ఇలాంటి రోస్టింగ్ ఎప్పుడూ చూడలే!