Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం ఏపీ పునర్విభజన బిల్లు పెట్టింది. ఆ బిల్లు బుధవారం లోక్‌సభలో పాసైంది. గురువారం రాజ్యసభలో ఆ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు మంత్రి లోకేష్. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధానితో లోకేష్ కీలక విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వైసీపీ వ్యవహారశైలి గురించి వివరించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో జగన్ చేసిన పనిని ప్రధాని దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. సభలో అన్నిపార్టీలు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చాయని, వైసీపీ సభ్యులు వాకౌట్ అయిన సందర్భంగా గుర్తు చేసినట్టు తెలుస్తోంది.
పావు గంటపాటు ప్రధాని మోదీతో వివిధ అంశాలపై చర్చ
ప్రధానితో భేటీ అయిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసి ఏళ్ల తరబడి నిలబడిన రైతుల అసాధారణ గాథను ప్రధానికి వివరించానని రాసుకొచ్చారు. వారి త్యాగాలను గౌరవిస్తూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు మార్గనిర్దేశం కోరినట్టు వెల్లడించారు.
ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు మంత్రి నారా లోకేష్. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత లోకేశ్ మిగతా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి బిల్లు ఆమోదానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు ఉన్నారు.
ALSO READ: అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా?
ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్
అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
ఏపీ ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్
Minister Nara Lokesh meets Prime Minister Narendra Modi.. Lokesh thanks PM for passing Amaravati… pic.twitter.com/sROQxMNFZ3
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2026