E-Paper
Advertisement

Chia Seeds: చియా సీడ్స్‌ను శీతాకాలంలో ఎందుకు తినాలి? చర్మం, జుట్టుకు ఎన్ని లాభాలో

Chia Seeds: చియా సీడ్స్‌ను శీతాకాలంలో ఎందుకు తినాలి? చర్మం, జుట్టుకు ఎన్ని లాభాలో
Advertisement

శీతాకాలం రాగానే చర్మం పొడిబారడం, మసకబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆహారంలో కొన్ని మంచి పదార్థాలు చేర్చితే చర్మం, జుట్టు ఆరోగ్యం చాలా బాగా మారుతుంది. అలాంటి పుష్కలమైన పోషకాలు ఉన్న ఆహారాల్లో చియా సీడ్స్‌ ఒకటి. ఈ గింజలు చిన్నగానే కనిపించినా వీటిలో ఒమేగా-3, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి చర్మం తేమను నిలబెట్టడంలో, జుట్టును బలంగా పెరగడంలో సహాయం చేస్తాయి.

చియా సీడ్స్ ఎందుకు మంచివి?
శీతాకాలంలో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. ఈ కారణంగా చర్మం ఒప్పుడే తేమ కోల్పోతుంది. చియా సీడ్స్‌లో ఉన్న ఒమేగా-3 చర్మాన్ని లోపల నుంచి మృదువుగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హానికర పదార్థాల నుంచి కాపాడుతాయి. జుట్టుకు అవసరమైన పోషకాలు అందించి వేలు బలపడేలా చేస్తాయి.

Advertisement

గోరువెచ్చని చియా నీరు
రాత్రి చియా సీడ్స్‌ను కొద్దిగా నీళ్లలో నానబెట్టండి. ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా వేసుకోవచ్చు. ఇది చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. ఉదయం ఓట్స్, దలియా లాంటి అల్పాహారం చేస్తుంటే అందులో నానబెట్టిన చియా సీడ్స్‌ వేసి తినండి. ఇది శక్తిని, పోషకాలను ఇస్తుంది.

చియా కషాయం
అల్లం, తులసి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి కషాయం తయారుచేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. తర్వాత నానబెట్టిన చియా సీడ్స్‌ వేసి తాగండి. ఇది ఇమ్యూనిటీకి చాలా మంచిది.పెరుగులో తేనె, నానబెట్టిన చియా సీడ్స్, ఆపిల్, దానిమ్మ, ఖర్జూరం వంటి పండ్లు కలిపి తింటే అది మంచి స్నాక్‌. చర్మం, జుట్టుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

Advertisement

చియా లడ్డూలు
గోండ్‌, నువ్వులు, బాదం, బెల్లం, నెయ్యి, చియా సీడ్స్‌ వేసి లడ్డూలు చేస్తే అవి శరీరానికి వేడి, శక్తి ఇస్తాయి. వింటర్‌లో చాలా మంచివి.వెజిటబుల్ సూప్, ఖిచ్డీ లేదా లైట్ కర్రీలపై చియా సీడ్స్‌ చల్లుకుంటే రుచికీ, ఆరోగ్యానికీ మంచిది. గోరువెచ్చని పసుపు పాలలో నానబెట్టిన చియా సీడ్స్‌ వేసి రాత్రి పడుకునే ముందు తాగితే చర్మం మృదువుగా మారుతుంది, మంచి నిద్ర కూడా వస్తుంది.

రోజుకు ఎంత తీసుకోవాలి?
రోజుకు 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్లు చాలు. కానీ ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి. నానబెట్టకుండా తింటే అవి పొట్టలో నీటిని పీల్చుకుని అసౌకర్యం కలిగించవచ్చు.

వీటివల్ల ప్రయోజనాలు
చియా సీడ్స్ తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. పొడి ప్యాచులు తగ్గిపోవడం, జుట్టు రాలడం తగ్గడం, జుట్టు మందం పెరగడం, శరీరం తేలికగా అనిపించడం, శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. చియా సీడ్స్‌ను ఇలా సులభంగా ఆహారంలో చేర్చుకుంటే చర్మం కాంతివంతంగా, జుట్టు బలంగా ఉంటుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×