E-Paper
Advertisement

IBomma Ravi Case: ఐబొమ్మ రవికి ఇక మూడినట్టే.. రంగంలోకి ఈడీ.. 30 అకౌంట్స్ గుర్తింపు

IBomma Ravi Case: ఐబొమ్మ రవికి ఇక మూడినట్టే.. రంగంలోకి ఈడీ.. 30 అకౌంట్స్ గుర్తింపు
Advertisement

ED Entered in IBomma Ravi Case: ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి కేసులో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా ఇమ్మడి వి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా, మీడియా మొత్తం ఇమ్మడి రవి అరెస్టు గురించే మాట్లాడుకుంటున్నారు. అతడి అరెస్టుతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, నెటిజన్స్ మాత్రం ఇమ్మడి రవి మద్దతుగా పోస్ట్స్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకం తెలుపుతున్నారు.

సీపీ సజ్జనార్ కి ఈడీ లేఖ

Advertisement

కాగా ప్రస్తుతం రవి పోలీసు కస్టడీలో ఉన్నారు. అతడి నుంచి కీలక సర్వర్లు, ల్యాప్ ట్యాప్స్,కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు వంటి కీలక ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు ఆయన బ్యాంక్ లావేదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. ఐబొమ్మ ద్వారా ఇమ్మడి రవి వందల కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడీ కేసులో ఈడీ ఎంటరైంది. అతడి కేసును తమకు అప్పగించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఈడీ తాజాగా లేఖ రాసింది. ‘ఐబొమ్మ రవి కేసులో కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఈడీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాసినట్టు సమాచారం.

Also Read: Actress Tulasi: బాలనటిగా కెరీర్ స్టార్ట్.. నటనకు రిటైర్మెంట్ ప్రకటించిన తులసి

Advertisement

30 ఖాతాలోపై దర్యాప్తు

దీంతో ఈడీ ఎంట్రీ ఈ కేసులో మరో మలుపు తీసుకుంది. కాగా ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి పోలీసులు కీలక సమాచారం సెకరించారు. అరెస్టు అనంతరం అతడి బ్యాంక్ ఖాతాలోని రూ. 3.5 కోట్లు పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో అతడి ఖాతాకు కోట్ల రూపాయల బదిలీ జరిగిందని, నెలకు రూ 15 లక్షల క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ (NRE) ఖాతాలకు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే అతడిపై పేరుపై మొత్తం 30 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన పూర్తి వివరానలు తమకు ఇవ్వాలని, వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ తమ లేఖలో పేర్కొంది. అంతేకాదే రవి 30 అకౌంట్ల సంబంధించిన ఈడీ త్వరలోనే దర్యాప్తు జరపనుందని సమాచారం.

ఆన్‌లైన్ బెట్టింగ్స్ కూడా?

కాగా ఇటీవల కుకట్పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో రవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు అనంతరం రవిని విచారించిన పోలీసులు కీలక వివరానలు రాబట్టారు. పైరసీ మాత్రమే కాదు.. రవికి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో కూడా సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి అరెస్ట్ అనంతరం రవిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు మరో 7 రోజుల కస్టడీని కోరారు. ఐ బొమ్మ ద్వారా నెలకు 35–40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. కొన్ని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయేందుకు రవి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ల ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×