E-Paper
Advertisement

గర్ల్‌ఫ్రెండ్ లేదా దొంగచాటుగా సిగరెట్ తాగడం.. తల్లిదండ్రులతో టీనేజ్ పిల్లలు ఈ 6 విషయాలు దాచిపెడతారు

గర్ల్‌ఫ్రెండ్ లేదా దొంగచాటుగా సిగరెట్ తాగడం.. తల్లిదండ్రులతో టీనేజ్ పిల్లలు ఈ 6 విషయాలు దాచిపెడతారు
Advertisement

Teenagers hide things from parents: యుక్తవయస్సు.. ప్రతి పిల్లవాడి జీవితంలో ఎంతో కీలకమైన దశ. ఈ సమయంలో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు వేగంగా జరుగుతాయి. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఆందోళన చెందుతుంటారు. అయినప్పటికీ, చాలా మంది టీనేజ్ పిల్లలు కొన్ని విషయాలను తల్లిదండ్రుల నుంచి దాచిపెడుతుంటారు. ఇంట్లో పెద్దలకు ఈ విషయాలు తెలిస్తే కోపగించుకుంటారనే భయం లేదా తమను అర్థం చేసుకోరనే భావన వల్ల ఇలా చేస్తారు.

భావోద్వేగాలు, ఒంటరితనం

టీనేజ్‌లో పిల్లలు అనేక భావోద్వేగ మార్పులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు వారు ఒంటరితనం, ఆందోళన లేదా గందరగోళాన్ని అనుభవిస్తారు. తమ భావాలను చెప్పినా తల్లిదండ్రులు అర్థం చేసుకోరని లేదా విమర్శిస్తారనే భయంతో వాటిని దాచిపెడుతుంటారు. అందుకే వారు సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు ఓపికగా వింటే పిల్లలు మరింత స్వేచ్ఛగా మాట్లాడగలరు.

క్రష్‌, లవ్ రిలేషన్

Advertisement

టీనేజ్‌లో ఎవరికైనా ఆకర్షితులు కావడం లేదా ప్రేమ భావన కలగడం సహజమైన విషయం. ఇది ఎదుగుదలలో, శారీరక, మానసిక మార్పులలో భాగమే. అయితే తల్లిదండ్రులు కోపగించుకుంటారనే భయంతో చాలా మంది పిల్లలు తమ క్రష్ లేదా రిలేషన్‌షిప్ గురించి చెప్పరు. ఈ కారణంగా కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెబుతారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారు తమ భావాలను దాచాల్సిన అవసరం ఉండదు.

స్నేహితులతో బయటకు వెళ్లడం

ఈ వయసులో పిల్లలకు స్వేచ్ఛపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలని, కొత్త అనుభవాలను పొందాలని అనుకుంటారు. అనుమతి ఇవ్వరనే భయం లేదా స్నేహితులను తప్పుబడతారనే భావన వల్ల వారు తమ ప్రణాళికలను దాచిపెట్టవచ్చు. భద్రత గురించి ప్రశాంతంగా మాట్లాడితే పిల్లలు నిజం చెప్పే అవకాశం పెరుగుతుంది.

ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియా

Advertisement

టీనేజ్ పిల్లలకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. కొంతమంది రహస్య సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉపయోగిస్తారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇతరులతో చాట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి అలవాట్లు సైబర్ బులీయింగ్, మోసాలు లేదా ఇతర ఆన్‌లైన్ ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే ఇంటర్నెట్ భద్రతపై పిల్లలకు అవగాహన కల్పించడం అవసరం.

తక్కువ మార్కులు రావడం

టీనేజ్‌లో చదువుపై ఏకాగ్రత తగ్గడం కొంతమందిలో కనిపిస్తుంది. భావోద్వేగ మార్పులు లేదా ఇతర కారణాల వల్ల మార్కులు తగ్గవచ్చు. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు తమను కొడతారు లేదా కొపగించుకుంటారనే భయంతో రిపోర్ట్ కార్డులు లేదా పరీక్ష ఫలితాలను దాచిపెడుతుంటారు. విమర్శించకుండా ప్రోత్సహిస్తే పిల్లలు చదువుపై మళ్లీ ఆసక్తి పెంచుకుంటారు.

Also Read: ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

స్నేహితుల ప్రభావంతో సిగరెట్ లేదా మద్యం అలవాటు

స్నేహితుల ప్రభావం టీనేజ్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది వారి ఒత్తిడితో సిగరెట్ లేదా మద్యం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఈ విషయం బయటపడితే తీవ్రంగా మందలిస్తారనే భయంతో వారు నిజాన్ని దాచిపెడుతుంటారు. తల్లిదండ్రులు కోపం చూపించకుండా ఆరోగ్యంపై కలిగే నష్టాలను ప్రశాంతంగా వివరించాలి.

భయంకన్నా నమ్మకమే ముఖ్యం

టీనేజ్ పిల్లలకు ఈ దశలో ప్రేమ, అర్థం చేసుకోవడం, మార్గనిర్దేశం చాలా అవసరం. కఠినమైన నియమాలు మాత్రమే పాటింపజేయడం సరైన పరిష్కారం కాదు. పిల్లల మాటలను శ్రద్ధగా విని, అర్థం చేసుకొని మాట్లాడే తల్లిదండ్రులతో వారు ఎక్కువగా మనసు విప్పుతారు. అలాంటి నమ్మకమైన వాతావరణం పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైనప్పుడు సహాయం కోరడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Tags

Related News

హై బీపీ వృద్ధాప్యంలో మాత్రమే వస్తుందని అనుకుంటే పొరపాటు.. డాక్టర్లు చెప్పిన కారణాలు ఇవే

గూగుల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలా? మీ రిజ్యూమ్‌ ఇలా తయారు చేయండి

డబ్బు, అందం కాదు.. మహిళలు తమ భర్తలో ఈ 3 గుణాలు ఉండాలని కోరుకుంటారు

‘బిర్యానీ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

చిన్న పిల్లలు నిద్రలో ఎందుకు నవ్వుతారు? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

సైట్ పెరుగుతోందని చెప్పే 10 వార్నింగ్ సైన్స్.. వెంటనే చెక్ చేసుకోండి!

డిటాక్స్ జ్యూస్‌లు వద్దే వద్దు.. గట్ హెల్త్ మెరుగుపరిచే సింపుల్ చిట్కాలు!

Big Stories

Advertisement
×