E-Paper
Advertisement

ప్రియుడిని బాయ్ ఫ్రెండ్ తో కలిసి… గుండె రాయిలా ఉంటేనే ఈ సినిమాను చూడండి

ప్రియుడిని బాయ్ ఫ్రెండ్ తో కలిసి… గుండె రాయిలా ఉంటేనే ఈ సినిమాను చూడండి
Advertisement

Korean Romantic Thriller: నచ్చిన అమ్మాయితో కలిసి ఒక ట్రిప్ కు వెళ్తే ఎలా ఉంటుంది ? ఆ ఆలోచనే హాయిగా ఉంది కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళామైనా, ప్రియురాలు అయినా… వాళ్ళతో కలిసి ఉండడానికి, అలా వెళ్ళడానికి కూడా వణికిపోతోంది మగజాతి మొత్తం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలా వణికించే కథ నేపథ్యంలోనే సాగుతుంది. అదే కొరియన్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డెడ్ అగైన్’ (Dead Again). మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ తమ పార్టనర్స్ తో కలిసి ఒక ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటారు. మిన్-హ్యుక్ – అతడి భార్య హే-జి, సీన్-వూంగ్ – అతడి ప్రేయసి మి-మి… ఈ నలుగురు కలిసి వియత్నాం అందాలను ఆస్వాదించడానికి వెళ్తారు. అయితే బయటకు ఎంతో ఆనందంగా కనిపించే ఈ గ్రూప్ లో ఊహించని ద్రోహం దాగి ఉంటుంది. మిన్-హ్యుక్ తన భార్యకు తెలియకుండా, తన ప్రాణస్నేహితుడి పార్ట్‌నర్ అయిన మి-మితో చాటుమాటుగా అఫైర్ నడుపుతుంటాడు.

Advertisement

ట్రిప్ సరదాగా ఆగిపోతుంది అనుకుంటున్నా సమయంలో ఊహించని సంఘటన జరుగుతుంది. మిన్-హ్యుక్‌కి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చి, ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ‘ఇక తన చాప్టర్ క్లోజ్’ అనుకునే లోపే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ నిమిషంలో కళ్లు తెరిచిన మిన్-హ్యుక్‌కి మైండ్ బ్లాక్ అవుతుంది. అతడు వియత్నాంలో అడుగు పెట్టిన ‘ఫస్ట్ డే’కి మళ్లీ చేరుకుంటాడు. మొదట్లో ఇది ఏదో కల అనుకుని కొట్టిపారేసినా, ప్రతీసారీ వేర్వేరు పరిస్థితుల్లో తను చనిపోవడం, మళ్లీ అదే మొదటి రోజుకి రావడం జరుగుతూ ఉంటుంది.

అతను ఎందుకు అలా పదే పదే మరణిస్తున్నాడు ? ఈ ట్రిప్‌లో తనను అంతం చేయడానికి ప్లాన్ వేస్తున్న ఆ రహస్య శత్రువు ఎవరు ? తన భార్యా ? స్నేహితుడా ? లేక తనతో రహస్య సంబంధం ఉన్న ప్రేయసినా ? తన చావు వెనుక ఉన్న ఆ నిజమైన ముసుగు వీరుడిని మిన్-హ్యుక్ ఎలా కనిపెట్టాడు ? ఈ భయంకరమైన టైమ్ లూప్ నుంచి బయటపడ్డాడా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

హాలిడే ట్రిప్ అనగానే ఎంజాయ్‌మెంట్, మైండ్ రిలాక్సేషన్ గుర్తొస్తుంది. కానీ అదే ట్రిప్ ఒక చావో రేవో తేల్చుకోవాల్సిన పీడకలగా మారితే ? పైగా చనిపోయిన ప్రతీసారీ మళ్లీ అదే లొకేషన్‌లో, అదే రోజున కళ్లు తెరవాల్సి వస్తే ? ఎలా ఉంటుందో ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. 2017లో కిమ్ డాంగ్-జున్ ప్రధాన పాత్రలో ఇదే టైటిల్‌తో ఒక కొరియన్ హారర్ మూవీ వచ్చింది. అయితే ఇది 2025లో వియత్నాం నేపథ్యంలో వచ్చిన సరికొత్త సైకలాజికల్ టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో లేదు. కానీ కొరియా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూపాంగ్ ప్లే, యు+మొబైల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: బాబోయ్ ఒక్కవారంలో 15 మిలియన్ల వ్యూస్… ఈవారం హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన సిరీస్ ఇదే

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×